sridevi drama company: పుస్తకంలో నుంచి పావురం వస్తే.. టేబుల్ గాల్లో తేలితే!
‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమానికి ప్రముఖ మెజీషియన్ కల్యాణ్ విచ్చేసి, తన ప్రతిభతో ఆకట్టుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పుస్తకంలో నుంచి పావురం బయటకి రావడం, టేబుల్ గాల్లోకి తేలడం.. ఇలాంటి అబ్బురపరిచే దృశ్యాల్ని మెజీషియన్లు అలవోకగా చేస్తుంటారు. చూస్తున్న వారిని ఆశ్చర్యంలో పడేస్తారు. ఇలాంటి మ్యాజిక్ (ఇంద్రజాలం)నే చేసి, ప్రేక్షకుల్ని కట్టిపడేశారు మెజీషియన్ కల్యాణ్. సుమారు 35 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్న ఆయన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమానికి విచ్చేసి, తన ప్రతిభని ప్రదర్శించారు. ఓ పుస్తకంలో నుంచి పావురాన్ని రప్పించి, టేబుల్‌ని తాకకుండా దాన్ని గాల్లో తేలేలా చేసి ఆకట్టుకున్నారు. ‘జబర్దస్త్’ నటులు సుధీర్, కార్తీక్, రాకేశ్ తదితరులు గతంలో కల్యాణ్ వద్ద కొన్నాళ్లు పనిచేశారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈ షోకి వచ్చిన కల్యాణ్‌కి ఆయన శిష్యులు కార్తీక్, రాకేశ్ కానుక అందించారు. అనంతరం ‘నేనూ మ్యాజిక్ చేస్తా’ అంటూ నరేశ్‌తో కలిసి రామ్ ప్రసాద్ నవ్వులు పూయించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ముఖ్య అతిథిగా హాజరైన ఈ ఎపిసోడ్ సెప్టెంబరు 5న బుల్లితెరపై సందడి చేసింది. ఇప్పుడు యూట్యూబ్ వేదికగా సర్‌ప్రైజ్ చేస్తోంది. ఇప్పటి వరకూ మీరు ఈ మ్యాజిక్‌ని చూడకపోతే ఇప్పుడు చూసేయండి...
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
David Warner: క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి విరుచుకుపడిన డేవిడ్ వార్నర్
-
World News
Prince Harry: కోర్టు బోనెక్కనున్న రాకుమారుడు.. 130 ఏళ్లలో తొలిసారి!
-
Movies News
Ahimsa movie review: రివ్యూ: అహింస.. దగ్గుబాటి అభిరామ్ ఫస్ట్ మూవీ ఎలా ఉందంటే?
-
India News
Periodic Table: పిరియాడిక్ టేబుల్‌ను ఎందుకు తొలగించామంటే..? NCERT వివరణ
-
Sports News
WTC Final: అశ్విన్ తుది జట్టులో ఉంటాడా... లేదా? ఆస్ట్రేలియా శిబిరంలో ఇదే హాట్ టాపిక్!
-
World News
Putin: చర్చితో సంబంధాలు బలపర్చుకొనే యత్నాల్లో పుతిన్..!