Kantara: ‘కాంతార’ పాటపై వివాదం.. కాపీ అంటూ ఆరోపణలు..
కాంతార సినిమాలోని వరాహరూపం.. దైవ వరిష్ఠం.. పాటకు కొత్త చిక్కులు వచ్చాయి. ఈ పాటను కాపీ చేశారంటూ కేరళకు చెందిన ప్రముఖ సంగీత బృందం లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్: ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ‘కాంతార’. ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొంటూ విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది. భాష, ప్రాంతాలకు అతీతంగా సినీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచే ‘వరాహ రూపం.. దైవ వరిష్ఠం..’ (Varaha Roopam) పాటను కాపీ చేశారంటూ చిత్ర బృందంపై తాజాగా కేరళలోని ఓ సంగీత బృందం ‘థాయికుడమ్ బ్రిడ్జ్’ ఆరోపణలు చేసింది. తమ బృందానికి చెందిన ‘నవరసం’ అనే పాటకు కాపీ చేశారంటూ పేర్కొంది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా సోషల్ మీడియాలో నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది.
‘‘కాంతార సినిమాకు మాకు(థాయికుడమ్ బ్రిడ్జ్) ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాలోని ‘వరాహరూపం..’పాట మేము రూపొందించిన ‘నవరసం’ పాటలానే ఉంది. మా అంగీకారం లేకుండా ఇలా కంపోజ్ చేయడం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమే. స్ఫూర్తిగా తీసుకొని పాటను చేయడానికి, కాపీ చేయడానికి మధ్య చాలా తేడా ఉంది. అలాగే అది వివాదస్పదం కూడా. అందుకే మేము ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. మేము మా శ్రోతలందరినీ మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం’’ అని థాయికుడమ్ బ్రిడ్జ్ కోరింది. ఈ పోస్టుకు కాంతార సినిమా నిర్మాత, సంగీత దర్శకుడు, దర్శకులను ట్యాగ్ చేసింది. అయితే ఈ ఆరోపణలపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!