Senapathi: సేనాపతి ‘ది ఛేజ్‌’ సీన్‌ చూశారా..!

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సేనాపతి’ (Senapathi). కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘8 తూటాకల్‌‌’కు రీమేక్‌గా ఈ సినిమా...

Published : 08 Jan 2022 14:58 IST

హైదరాబాద్‌: నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సేనాపతి’ (Senapathi). కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘8 తూటాకల్‌‌’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందించారు. పవన్‌సాధినేని దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈనేపథ్యంలో తాజాగా ‘సేనాపతి’ నుంచి ఓ స్పెషల్‌  వీడియోని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘ది ఛేజ్‌’ పేరుతో విడుదలైన ఈ వీడియోలో కీలక పాత్రధారి అయిన నరేశ్‌ అగస్త్య దొంగని ఛేజ్‌ చేస్తూ కనిపించారు. ఈ క్రమంలోనే తన తుపాకీని ఎక్కడో చేజార్చుకోవడంతో తన పోలీస్ ఉద్యోగం ప్రమాదంలో పడటం వంటి సన్నివేశాలతో ఈ వీడియో రూపుదిద్దుకుంది. మరోవైపు ఇప్పటివరకూ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకుల్ని అలరించిన రాజేంద్రప్రసాద్‌ మొదటిసారి ఈ విధమైన క్రైమ్‌ థ్రిల్లర్‌లో నటించారు. ఇందులో ఆయన సీరియస్‌ రోల్‌లో కనిపించారు. చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత, ఆమె భర్త విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని