VIKRAM: కమల్‌హాసన్‌ బర్త్‌డే స్పెషల్‌ వీడియో.. ఇది శాంపిల్‌ మాత్రమే!

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్రమ్‌’. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై

Updated : 06 Nov 2021 18:36 IST

హైదరాబాద్‌: కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్రమ్‌’. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై మహేంద్రన్‌తో కలిసి కమల్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌, కాళిదాస్‌ జయరాం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం కమల్‌హాసన్‌ పుట్టినరోజు సందర్భంగా ‘విక్రమ్‌ ఫస్ట్‌ గ్లాన్స్‌’ పేరుతో చిత్ర బృందం వీడియోను విడుదల చేసింది. ఇందులో జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే కమల్‌హాసన్‌ ఆయన టీమ్‌ అడ్డుకునే ప్రయత్నం చేసింది. 48 సెకన్ల నిడివి ఉన్న వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇక అనిరుధ్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం కొత్తగా ఉంది. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల జరిగిన షూటింగ్‌లో విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ‘విక్రమ్‌’కు గిరీష్‌ గంగాధరన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు