Tillu square: టిల్లు రాక ఎప్పుడంటే?

గతేడాది ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన చిత్రాల్లో ‘డీజే టిల్లు’ ఒకటి. టిల్లు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ చేసిన సందడి అలరించింది.

Updated : 28 Oct 2023 14:07 IST

తేడాది ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన చిత్రాల్లో ‘డీజే టిల్లు’ ఒకటి. టిల్లు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ చేసిన సందడి అలరించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్‌’ రూపొందుతోంది. ఇందులోనూ సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. మల్లిక్‌రామ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ‘‘తొలి భాగానికి ఏమాత్రం తగ్గని రీతిలో సినిమాని సిద్ధం చేస్తున్నాం. టిల్లు, రాధిక పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయినట్టే ఇందులోనూ నాయకానాయికల పాత్రలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో సిద్ధు, అనుపమ కలిసి చేసిన సందడి సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. అంచనాలకి దీటుగా చిత్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సాయిప్రకాశ్‌ ఉమ్మడిసింగు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని