Social Look: ప్రియుడితో రకుల్‌.. మహేశ్‌ని హత్తుకున్న నమ్రత.. స్విమ్‌ సూట్‌లో మాళవిక

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 07 Aug 2023 01:44 IST
  • మహేశ్‌బాబు (Mahesh Babu) గత కొన్నిరోజుల క్రితం తన కుటుంబసభ్యులతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన స్కాట్‌లాండ్‌లో ఉన్నారు. తాజాగా ఆయన షేర్‌ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆయన తన సతీమణి నమ్రతతో కలిసి ఫైర్‌ వర్క్స్‌ను ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. ఈ లవ్లీ మూమెంట్‌ను సితార, గౌతమ్‌ క్లిక్‌ మనిపించారని ఆయన పేర్కొన్నారు.
  • స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ తారలందరూ విషెస్‌ తెలుపుతున్నారు. నటి రకుల్‌ (Rakul Preet Singh) సైతం తన స్నేహితుల ఫొటోలు ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘నిజమైన స్నేహితులు ఎప్పటికీ విడిపోరు. దూరం కారణంగా వాళ్లు కలవకపోవచ్చు కానీ, హృదయంలో ఎప్పటికీ కలిసే ఉంటారు’’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇందులోని ఓ ఫొటోలో ఆమె తన ప్రియుడు జాకీ భగ్నానీతో కనిపించారు.
  • నటి మాళవికామోహనన్‌ (Malavika Mohanan) స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద సేద తీరుతూ కనిపించారు. బికినీ ధరించి.. బుక్‌ చదువుకుంటూ ఫొటోలకు పోజులిచ్చారు.



















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని