Social Look: మహేశ్‌ థ్యాంక్యూ.. నాపై దృష్టి పెట్టండి అంటోన్న ఐశ్వర్య.. శునకాలతో సమంత

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 11 Aug 2023 01:53 IST
  • తన పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పిన అభిమానులు, శ్రేయోభిలాషులకు మహేశ్‌బాబు (Mahesh Babu) ధన్యవాదాలు చెప్పారు. తమ విషెస్‌తో తన బర్త్‌డేని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారని పేర్కొన్నారు. మరోవైపు.. మహేశ్‌ బర్త్‌డే ఎలా జరిగిందో తెలియజేస్తూ ఆయన సతీమణి నమ్రత ఓ ఫొటో షేర్‌ చేశారు. ‘లేజీ బర్త్‌డే’ అని ఆమె క్యాప్షన్‌ ఇచ్చారు.
  • నటి సమంత (Samantha) తన పెంపుడు శునకాలతో ఆడుకుంటూ కనిపించారు. వర్క్‌ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్న ఆమె ఇటీవల బాలీ టూర్‌కు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.
  • నటి ఐశ్వర్య మేనన్‌ (Iswarya Menon) తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో ఆమె షేర్‌ చేశారు. ‘‘హాయ్‌. రెండు నిమిషాలు నా వైపు చూస్తారా? ఓకే. మీ అటెన్షన్‌ను నాపై పెట్టినందుకు లవ్‌ యూ’’ అని ఆమె పేర్కొన్నారు.


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని