Tovino Thomas: ఉత్తమ నటుడిగా టొవినో థామస్‌.. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో

టొవినో థామస్‌ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపొందారు.

Published : 10 Mar 2024 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 44వ ‘ఫాంటస్‌పోర్టో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ (Fantasporto International Film Festival) పోర్చుగల్‌లోని పోర్టో వేదికగా అట్టహాసంగా జరిగింది. ఆ వేడుకలో.. ఉత్తమ నటుడిగా టొవినో థామస్‌ (Tovino Thomas) అవార్డు గెలుచుకున్నారు. మలయాళ చిత్రం ‘అదృశ్య జలకంగళ్‌’ (Adrishya Jalakangal)లోని నటనకుగాను ఆయన్ను ఈ పురస్కారం వరించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో తెలియజేస్తూ టొవినో ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభకు గుర్తింపు దక్కడం గర్వంగా ఉందన్నారు. తనకు అవకాశం ఇచ్చిన దర్శక, రచయితలకు, సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఫ్రమ్‌ ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ (జపాన్‌) బెస్ట్‌ ఫిల్మ్‌, ‘ది కాంప్లెక్స్‌ ఫామ్స్‌’ (ఇటలీ) స్పెషల్‌ జ్యూరీ బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డులు దక్కించుకున్నాయి.

యుద్ధ నేపథ్యంలో డా. బిజు దర్శకత్వంలో రూపొందిన ‘అదృశ్య జలకంగళ్‌’ గతేడాది నవంబరులో బాక్సాఫీసు ముందుకొచ్చింది. ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ‘టాలిన్‌ బ్లాక్‌ నైట్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లోనూ ప్రదర్శితమైంది. ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. టొవినో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘మిన్నల్‌ మురళి’, ‘2018’ తదితర డబ్బింగ్‌ చిత్రాలతో ఇక్కడి వారిని అలరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని