ఇకపై నటించను.. ఇదే నా చివరి సినిమా: ప్రముఖ తమిళ హీరో

ఎన్నో సినిమాల్లో హీరోగా, అతిథి పాత్రల్లో మెప్పించిన ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin) సినిమాలకు స్వస్తి పలికారు. మరిసెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన మామన్నాన్‌(Maamannan) తన చివరి సినిమా అని చెప్పారు. 

Published : 14 Dec 2022 17:03 IST

హైదరాబాద్‌: పదేళ్ల నుంచి తన సినిమాలతో మెప్పించిన యంగ్‌ హీరో సినిమాలకు గుడ్‌ బై చెప్పారు. రాజకీయాల్లో కీలక బాధ్యతలు స్వీకరించడం వల్ల సినిమాల్లో నటించడం లేదని ప్రకటించారు. పదేళ్ల క్రితం ఒరు కాల్‌ ఒరు కన్నాడి(ఓకే ఓకే) సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేశారు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin)‌. అప్పటి నుంచి నటుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ సినీ ప్రియులకు దగ్గరయ్యారు. ఒకవైపు సినిమా రంగంలో ఉంటూనే రాజకీయంరంగంలోనూ తన సత్తా చాటారు. గతేడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్‌-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో అప్పటినుంచి కొత్త సినిమాలను ఏవీ అంగీకరించ లేదు. ఇక తాజాగా తాను సినిమాల్లో నటించనని స్పష్టం చేశారు.

మారిసెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న మామన్నాన్‌(Maamannan) తన చివరి సినిమా అని చెప్పారు. అలాగే కమల్‌ హాసన్‌ ప్రాజెక్ట్‌ నుంచి కూడా వైదొలగినట్లు ప్రకటించారు. ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఉదయనిధి ‘నేను రాజకీయ జీవితంలో ఎక్కవ సమయం గడపాలి. నా నియోజకవర్గాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇప్పుడు ఏ సినిమానైనా అంగీకరిస్తే దానికోసం కనీసం ఐదు నెలలు వెచ్చించాల్సి వస్తుంది. అందుకే ఇక సినిమాకు సంబంధించిన కమిట్‌మెంట్‌లను తగ్గించుకుంటున్నాను’ అని చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు