Published : 25 Apr 2022 10:30 IST

Telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!

Upcoming movies in telugu: బాక్సాఫీస్‌ వద్ద ‘ఆర్‌ఆర్‌ఆర్‌’,‘కేజీయఫ్‌2’ల జోరు కొనసాగుతోంది.  ఈ క్రమంలో ఏప్రిల్‌ చివరి వారంలో మరో పెద్ద సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆ చిత్రాలేంటో చూసేద్దామా!

అందుకే ‘ఆచార్య’ అంటారు!

అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi) నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు ‘ఆచార్య’(Acharya)గా అలరించబోతున్నారు. కమర్షియల్‌ సినిమాలకు సందేశాన్ని జోడించి చెప్పటంలో సిద్ధహస్తుడైన కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో రామ్‌చరణ్‌(Ram charan) ఓ కీలక పాత్ర పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘ధర్మస్థలి’ అనే ప్రాంతం చుట్టూ తిరిగే కథతో అభిమానులను అలరించేలా కొరటాల శివ సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. ఇక తెరపై చిరు-చరణ్‌ కనిపించే సన్నివేశాలు మరో స్థాయిలో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. తండ్రీకొడుకుల మేజిక్‌ చూడాలంటే ఏప్రిల్‌ 29వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.


‘ఆచార్య’ కంటే ముందుగా...

చిరంజీవి సినిమా వస్తుందంటే మరో చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శక-నిర్మాతలు వెనకడుగు వేస్తారు.  కానీ, ఓ ఆసక్తికర తమిళసినిమా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), నయనతార(Nayanthara), సమంత(Samantha) కీలక పాత్రల్లో విఘ్నేశ్‌ శివన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కాతు వాక్కుల రెండు కాదల్‌’. తెలుగులో ‘కణ్మని రాంబో ఖతీజా’(Kanmani Rambo Khatija) పేరుతో విడుదల కానుంది.  ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తే అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఇద్దరితోనూ అతను పడిన కష్టాలేంటి? చివరకు ఇద్దరి మనసులను గెలుచుకున్నాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఏప్రిల్‌ 28న ‘కణ్మని రాంబో ఖతీజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.


‘రన్‌ వే 34’తో వస్తున్న అమితాబ్‌, అజయ్‌

బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌దేవగణ్‌(Ajay Devgn) దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రన్‌వే 34’(Runway 34).అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan), రకుల్‌ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh) ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా  ఏప్రిల్‌ 29  ప్రేక్షకుల ముందుకు రానుంది.  2015లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.  విమానయాన రంగం చుట్టూ తిరిగే ఈ కథలో అజయ్‌, రకుల్‌ పైలట్లుగా, అమితాబ్‌ విచారణాధికారిగా నటిస్తున్నారు.


ఈ వారం ఓటీటీలో రాబోతున్న చిత్రాలు

నెట్‌ఫ్లిక్స్‌

* గంగూబాయి కథియావాడి(తెలుగు) ఏప్రిల్‌ 26

* 365 డేస్‌: ది డే(హాలీవుడ్‌)

* మిషన్‌ ఇంపాజిబుల్‌ (తెలుగు) ఏప్రిల్‌ 29

* ఓ జార్క్‌ (వెబ్‌ సిరీస్‌) ఏప్రిల్‌29

ఊట్‌

* బేక్డ్‌ (హిందీ సిరీస్‌-3) ఏప్రిల్‌ 25

* ద ఆఫర్‌ (వెబ్‌ సిరీస్‌) ఏప్రిల్‌ 28

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

* అనుపమా: నమస్తే అమెరికా (హిందీ) ఏప్రిల్‌ 25

జీ5
* నెవర్‌ కిస్‌ యువర్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ (హిందీ) ఏప్రిల్‌ 29

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని