
telugu movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సినిమాల సందడి కొనసాగుతోంది. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న ఆ సినిమాలేంటో చూసేద్దామా!
థియేటర్‌లపై నవ్వుల మిసైల్
కొన్ని సినిమాలు టీవీలో వస్తుంటే కొద్దిసేపు చూద్దామని మొదలు పెడతాం. సినిమా పూర్తయ్యే వరకూ కూర్చొన్న చోటు నుంచి కదలం. అంతలా మనల్ని అలరిస్తాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘ఎఫ్2’. దానికి కొనసాగింపుగా మూడింతలు పంచటానికి ‘ఎఫ్3’ (F3: Fun and Frustration) అంటూ వచ్చేస్తున్నారు వెంకటేశ్(Venkatesh), వరుణ్‌తేజ్(Varuntej). అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈచిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తొలి భాగాన్ని మించేలా నవ్వులు పంచడానికి అదనంగా సునీల్, అలీ కూడా చేతులు కలిపారు. మరి సమ్మర్ సోగ్గాళ్లు పడిన కష్టాలు ఏంటి? ఎలా నవ్వులు పంచారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే...
వివాదాలతో మొదలై.. విజయాన్ని అందుకుని..
కొన్ని సినిమాలు కథ, కథనం, కాన్సెప్ట్, కాస్టింగ్‌తో క్రేజ్ తెచ్చుకుంటాయి. ఇంకొన్ని సినిమాలు వివాదాలతో క్రేజ్ సంపాదిస్తాయి. అలా ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విశ్వక్‌సేన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా మే 6న విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ముగ్గురి ప్రేమ కథ..
విజయ్ సేతుపతి, సమంత, నయనతార కలసి నటించిన ప్రేమకథా చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ (Kaathuvaakula Rendu Kaadhal). తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో విడుదలైంది. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను థియేటర్లలో అలరించిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ వేదికగా సందడి చేయబోతుంది. మే 27 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+ Hotstar)లో స్ట్రీమింగ్ కానుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.
ఓటీటీలో సూపర్ సోల్జర్
జాన్ అబ్రహం సూపర్‌సోల్జర్‌గా నటించిన చిత్రం ‘అటాక్: పార్ట్1’. ప్రకాష్‌రాజ్, రకుల్ ప్రీత్‌సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ జీ5లో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే మరికొన్ని చిత్రాలు.. వెబ్‌సిరీస్
నెట్‌ఫ్లిక్స్
* ద లాడ్జ్ (హాలీవుడ్) మే 22
* వెల్‌కమ్ టు వెడ్డింగ్ హెల్ (హాలీవుడ్) మే 23
* తులసీదాస్ జూనియర్ (హిందీ) మే 23
* స్ట్రేంజర్స్ థింగ్స్ (వెబ్‌సిరీస్-4) మే27
జీ5
* ఫోరెన్సిక్ (హిందీ) మే 24
డిస్నీ+హాట్‌స్టార్‌లో
* ఒబీ వ్యాన్ కెనోబీ (వెబ్ సిరీస్) మే 27
సోనీ లివ్
* నిర్మల్ పాఠక్ కీ ఘర్ వాపసీ (హిందీ సిరీస్) మే 27
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Stock Market Update: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Movies News
Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
-
General News
Gudipudi Srihari: సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
-
Ap-top-news News
Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Telangana News: తెలంగాణ.. స్టార్టప్ ‘సూపర్‌స్టార్’