telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన చిత్రాలివే!

Published : 06 Apr 2022 02:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’తో రెండో వారమూ బాక్సాఫీస్‌ కళకళలాడుతోంది. ఈ క్రమంలో ఈ వారం అటు థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దామా!

పెద్ద సినిమా ఆ ఒక్కటే

ఇటీవల కాలంలో అడపా దడపా క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. కథల ఎంపిక బాగున్నా, భావోద్వేగాల పరంగా మెప్పించడంలో తడబడుతున్నాయి. కానీ, ఆ లోటు తీర్చేస్తానంటున్నారు యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌(Varun tej). ఆయన బాక్సర్‌గా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గని’(Ghani). సయీ మంజ్రేకర్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ ‘తమ్ముడు’ స్ఫూర్తితోనే ఈ సినిమా చేసినట్లు వరుణ్‌ చెబుతున్నారు. జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌శెట్టి ఇలా భారీతారగణమే ఉంది. దీనికి తోడు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. మరి బాక్సర్‌గా అబ్దుల్‌ గని ఉస్మాన్‌ అలియాస్‌ గని ప్రయాణం ఎలా సాగింది? బాక్సర్‌గా పేరు తెచ్చుకునే క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గీతా ఆర్ట్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కడం విశేషం.


వర్మ మరో ప్రయోగం

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్‌ డ్రామా చిత్రం ‘మా ఇష్టం’(డేంజరస్‌). అప్సరారాణి(Apsara Rani), నైనా గంగూలీ(Naina ganguly) కీలక పాత్రలు పోషించారు. తెలుగులో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం  ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఈ సినిమా పోస్టర్‌ చూసినా, ట్రైలర్‌ చూసినా ‘పెద్దవాళ్లకి మాత్రమే’ తరహా సినిమానేమో అనే అభిప్రాయం కలుగుతుంది. నిజానికి ఇదొక క్రైమ్‌ డ్రామా. స్వలింగ సంపర్కులైన ఇద్దరు మహిళల ప్రేమకథగా సాగుతుంది. ఇన్నేళ్లుగా ఇన్ని సినిమాలు చేశాక నేనొక ప్రయోగం చేస్తే నాకు పోయేదేమీ లేదు’ అని వర్మ చెబుతున్నారు. మరి వర్మ మరో ప్రయోగం ఫలిస్తుందా? వికటిస్తుందా? చూడాల్సి ఉంది. వీటితో పాటు, మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’, ‘బరి’, ‘డస్టర్’‌, ‘కథ కంచికి మనం ఇంటికి’ సినిమాలు వాటిలో ఉన్నాయి.


ఈ వారం ఓటీటీలో రాబోతున్న చిత్రాలివే!

స్టాండప్‌ రాహుల్‌

ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’(StandUp Rahul). రాజ్‌తరుణ్‌(Raj tarun) కథానాయకుడిగా శాంటో మెహన వీరంకి తెరకెక్కించారు. వర్ష బొల్లమ్మ(varsha bollamma) కథానాయిక. స్టాండప్‌ కామెడీతో నవ్వులు పంచడమే కాదు, కథానాయికతో కలిసి తెరపై భావోద్వేగాలు పంచారు రాజ్‌తరుణ్‌. ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగాఏప్రిల్‌ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.  నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, మురళీశర్మ, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* మర్డర్‌ ఇన్‌ అగోండా(హిందీ) ఏప్రిల్‌ 8

* నారదన్‌ (మలయాళం) ఏప్రిల్‌ 8

నెట్‌ఫ్లిక్స్‌

* చస్వీ (హిందీ) ఏప్రిల్‌ 7

* ఎత్తర్కుం తునిందావన్‌ (తమిళ్‌) ఏప్రిల్‌7

* ఎలైట్‌ (వెబ్‌ సిరీస్‌) ఏప్రిల్‌ 8

* మెటల్‌ లార్డ్స్‌ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 8

* ద ఇన్‌బిట్విన్‌ (హాలీవుడ్‌)ఏప్రిల్‌ 8

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

* ద కింగ్స్‌ మెన్‌ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 8

జీ5

* ఎక్‌ లవ్‌ యా(కన్నడ) ఏప్రిల్‌ 8

* అభయ్‌ (హిందీ) ఏప్రిల్‌ 8

సోనీ లివ్‌

గుల్లక్‌ (హిందీ) ఏప్రిల్‌ 7

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని