Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలేంటో తెలుసా?

దీపావళికి బాక్సాఫీస్‌ వద్ద డబ్బింగ్‌ సినిమాలే సందడి చేశాయి. నవంబరు మూడో వారంలో పలు ఆసక్తికర చిన్న చిత్రాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. అలాగే ఓటీటీలోనూ మూవీలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. అలా ఈ వారం అలరించే చిత్రాలేంటో చూసేయండి.

Updated : 13 Nov 2023 10:26 IST

విభిన్న యాక్షన్‌ థ్రిల్లర్‌తో..

పాయల్‌ రాజ్‌పూత్‌ (Payal Rajput), అజ్మల్‌ అమిర్‌  ప్రధాన పాత్రల్లో అజయ్‌ భూపతి  రూపొందించిన చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ.ఎం. నిర్మించారు. నవంబరు 17న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవరూ స్పృశించని ఓ కొత్త అంశంతో ‘మంగళవారం’ తెరకెక్కించారని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.


ఉత్కంఠకు గురి చేసే.. శృతి

‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ (My Name Is Shruthi) అంటూ సినీప్రియుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది నటి హన్సిక. ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ నాయికా ప్రాధాన్య చిత్రాన్ని శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ‘‘ఊహకందని మలుపులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతిగా హన్సిక కనిపిస్తుంది’’ అని సినీ వర్గాలు తెలిపాయి. నవంబరు 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


సరికొత్త కథాంశంతో  స్పార్క్‌: ది లైఫ్‌

విక్రాంత్‌ హీరోగా నటించి.. స్వయంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’ (Spark The Life). డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది.


‘సైడ్‌ బి’ ఎలా ఉండబోతోంది?

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty) కీలక పాత్రలో నటించిన ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్‌-ఎ’ (Sapta Sagaralu Dhaati Side A). రుక్మిణీ వసంత్‌ కథానాయిక. హేమంత్‌ ఎం రావు దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడిదే చిత్రానికి కొనసాగింపుగా ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ బి’ (Sapta Sagaralu Dhaati Side B) విడుదల కానుంది. నవంబర్‌ 17న కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ఇది ప్రేక్షకులకు  ముందుకు రానుంది.


అడవిలో ‘అన్వేషి’

విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్వేషి’ (Anvesh). వి.జె.ఖన్నా దర్శకత్వం వహిస్తున్నారు. టి.గణపతిరెడ్డి నిర్మాత. ‘‘అడవి నేపథ్యంలో సాగే కథ ఇది. కథానాయిక అనన్య నాగళ్ల కీలక పాత్రని పోషించారు. ఆమె చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.  చైతన్‌ భరద్వాజ్‌ మరోసారి తన సంగీతంతో ఆకట్టుకుంటాడు’’అని చిత్ర బృందం చెబుతోంది. నవంబరు 17న ఈ సినిమా విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో అలరిం చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

  • అమెజాన్‌ ప్రైమ్‌
  • ట్విన్‌ లవ్‌ (హాలీవుడ్‌) నవంబరు 17

డిస్నీ+హాట్‌స్టార్‌

  • అపూర్వ (హిందీ) నవంబరు 15
  • చిత్త (తమిళ/తెలుగు) నవంబరు 17

  • కన్నూర్‌ స్క్వాడ్‌ (మలయాళం) నవంబరు 17

నెట్‌ఫ్లిక్స్‌

  • హౌటూ బికమ్‌ ఏ మాబ్‌ బాస్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 14
  • బెస్ట్‌ క్రిస్మస్‌ ఎవర్‌ (హాలీవుడ్‌) నవంబరు 16
  • ది క్రౌన్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 16
  • బిలీవర్‌2 (కొరియన్‌) నవంబరు 17
  • ది డాడ్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 17
  • సుఖీ (హిందీ) నవంబరు 17
  • ది రైల్వేమెన్‌ (హిందీ) నవంబరు 18

బుక్‌ మై షో

  • రాంగ్‌ ప్లేస్‌ (హాలీవుడ్)నవంబరు 12
  • ది ఎగ్జార్సిస్ట్‌ (హాలీవుడ్‌) నవంబరు 17

జియో సినిమా

  • ది ఫ్లాష్‌ (తెలుగు) నవంబరు 15

ఆపిల్‌ టీవీ ప్లస్‌

  • మోనార్క్‌(హాలీవుడ్‌) నవంబరు 17
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని