Vallabhaneni Janardhan: సినీనటుడు వల్లభనేని జనార్దన్‌ కన్నుమూత

సినీనటుడు, నిర్మాత, దర్శకుడు వల్లభనేని జనార్దన్‌(63) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.

Updated : 30 Dec 2022 07:08 IST

సినీనటుడు, నిర్మాత, దర్శకుడు వల్లభనేని జనార్దన్‌(63) (Vallabhaneni Janardhan) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన ఆయనకు భార్య లాలిని, కుమారుడు అవినాష్‌, కూతురు అభినయ ఉన్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దగ్గర ‘వేటగాడు’ సినిమాకి సహాయ దర్శకులుగా సినీ ప్రయాణం మొదలుపెట్టిన వల్లభనేని జనార్దన్‌... 1982లో ప్రముఖ దర్శక నిర్మాత విజయబాపినీడు కూతురు లాలినిని వివాహం చేసుకున్నారు. 1982లో ‘అమాయక చక్రవర్తి’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘తోడు నీడ’, ‘శ్రీమతి కావాలి’, ‘పారిపోయిన ఖైదీలు’ సినిమాల్ని నిర్మించారు. చిరంజీవి ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాలో పోలీసు అధికారిగా ఆకట్టుకున్నారు. జనార్దన్‌ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి.

న్యూస్‌టుడే, బంజారాహిల్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని