Venkatesh: ఇప్పుడు టర్న్ తీసుకున్నా.. ‘రానా నాయుడు’పై వెంకటేశ్ కామెంట్
‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు వెంకటేశ్ (Venkatesh). అందరికీ తాను ఓ ఫ్యామిలీ హీరోగానే తెలుసని.. ఇప్పుడు కాస్త టర్న్ తీసుకున్నానని అన్నారు.
హైదరాబాద్: ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్‌పై నటుడు వెంకటేశ్ (Venkatesh) తాజాగా స్పందించారు. ఇంతకు ముందు తానెప్పుడూ ఇటువంటి పాత్రలు చేయలేదని అన్నారు. రానా(Rana)తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘వ్యక్తిగతంగా ఇది నాకు చాలా కొత్త. ఇలాంటిది ఇంతకు ముందు నేనెప్పుడూ చేయలేదు. నేనొక ఫ్యామిలీ హీరోగానే అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు కాస్త టర్న్ తీసుకున్నా. దర్శక నిర్మాతలు, ఇతర బృందం.. ఈ పాత్ర నేను చేయగలనని నమ్మినందుకు సంతోషిస్తున్నా. నా బెస్ట్ నేనిచ్చా’’ అని వెంకీ అన్నారు. రానా (Rana) మాట్లాడుతూ..‘‘బాబాయ్‌తో కలిసి సిరీస్‌లో నటించినందుకు ఆనందంగా ఉంది. ఏదైనా విభిన్నంగా. అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాం. ఇదొక విభిన్నమైన ఫ్యామిలీ డ్రామా’’ అని చెప్పారు.
యాక్షన్ - ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘రానా నాయుడు’ (Rana Naidu) తెరకెక్కింది. సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ దీనికి దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ సిరీస్ అనతి కాలంలోనే ఆ ఓటీటీ ట్రెండింగ్ జాబితాలో ప్రథమస్థానానికి చేరింది. ఇందులో రానా సెలబ్రిటీల సమస్యలను తీర్చే వ్యక్తిగా నటించారు. ఆయనకు తండ్రిగా వెంకటేశ్ కనిపించారు. సిరీస్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం ఎక్కువగా ఉన్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేశారు. వెంకటేశ్ నుంచి ఈ తరహా కథలను తాము ఊహించలేదంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్‌లో లులు మాల్
-
TS TET Results: టెట్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్‌లో..
-
‘నా పెద్ద కొడుకు’ అరెస్టుతో ఆకలి, నిద్ర ఉండడం లేదు
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ