Viduthalai: ‘విడుదలై’ టీమ్‌పై ప్రశంసలు.. నటుడి ఆనందం

సూరి, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘విడుదలై’. తాజాగా ఈ చిత్రం ప్రశంసలు అందుకొంది.

Published : 01 Feb 2024 19:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సూరి (Soori), విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రల్లో కోలీవుడ్‌ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కించిన చిత్రం ‘విడుదలై’ (Viduthalai). గతేడాది విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్‌లో విజయాన్ని అందుకుంది. ‘విడుదల’ పేరుతో తెలుగులోనూ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. రోటర్‌డ్యామ్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ‘విడుదలై’ ప్రదర్శించారు. సినిమా పూర్తైన వెంటనే వీక్షకులు.. లేచి నిల్చొని చప్పట్లు కొట్టారు. వెట్రి మేకింగ్‌ స్టైల్‌.. నటీనటుల ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయంటూ మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సూరి ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో షేర్‌ చేశారు. తమ చిత్రానికి గౌరవం దక్కడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పీరియాడికల్‌ క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కిన ‘విడుదలై’లో సూరి పోలీస్‌ అధికారి పాత్ర పోషించారు. ‘విడుదలై పార్ట్‌2’ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

Paramporul: రివ్యూ: పరంపోరుల్‌: వెయ్యేళ్ల చరిత్ర కలిగిన విగ్రహాన్ని విక్రయించాలనుకున్న వారి పరిస్థితేంటి?

కథేంటంటే: కుమ‌రేశ‌న్ (సూరి) కొత్త‌గా ఉద్యోగంలో చేరిన పోలీస్ కానిస్టేబుల్‌. ప్ర‌జాద‌ళం నాయ‌కుడైన పెరుమాళ్‌(విజ‌య్ సేతుప‌తి)ని ప‌ట్టుకునేందుకు ప‌నిచేస్తున్న ప్ర‌త్యేక‌ పోలీస్ ద‌ళంలో డ్రైవ‌ర్‌గా చేరతాడు. ప్ర‌జ‌ల‌కు క‌ష్టం వ‌స్తే ఆదుకోవ‌డ‌మే పోలీస్ విధి అనేది అతడు న‌మ్మిన సిద్ధాంతం. అనుకోని పరిస్థితుల్లో ఓ వృద్ధురాలిని కాపాడేందుకు పోలీస్‌ జీపు ఉపయోగించి..  అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. కాబట్టి ఎవరికీ క్షమాపణ చెప్పనని అంటాడు. మ‌రోవైపు గాయ‌ప‌డిన వృద్ధురాలి మ‌న‌వరాలు పాప (భ‌వానీ శ్రీ)తో కుమ‌రేశ‌న్ స్నేహం చేస్తాడు. అది కాస్త ప్రేమ‌కి దారితీస్తుంది. ఒకప‌క్క ప్రేమ‌, ఇంకోవైపు పెరుమాళ్ కోసం సాగించే వేట‌లో అతడు ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కి గుర‌వుతాడ‌న్న‌దే మిగ‌తా క‌థ‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని