Vijay Antony: డిప్రెషన్‌.. విజయ్‌ ఆంటోనీ ఏమన్నారంటే..?

తన తదుపరి చిత్రం ‘రోమియో’ రిలీజ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony). తెలుగులో ఇదే చిత్రాన్ని ‘లవ్‌ గురు’ పేరుతో విడుదల చేయనున్నారు.

Published : 17 Mar 2024 00:07 IST

హైదరాబాద్‌: మానసిక ఒత్తిడిపై తాజాగా జరిగిన ఈవెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు విజయ్‌ ఆంటోనీ. దానిని ఎలా ఎదుర్కోవాలో చెప్పారు. ‘‘ప్రస్తుత రోజుల్లో మన గురించి మనం ఆలోచించడం మానేశాం. ఎదుటి వ్యక్తులు, వాళ్ల సమస్యలపై ఎక్కువ ధ్యాస పెడుతున్నాం. ఇది నీ జీవితం. వేరే వాళ్లది కాదు. కాబట్టి వేరేవాళ్ల విషయాలు తెలుసుకుని బాధపడకు. నువ్వేంటో తెలుసుకో. నీ కోసం సమయం కేటాయించు. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నించు. పుస్తకాలు చదువు. తద్వారా ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల డిప్రెషన్‌ నుంచి బయటకు రావొచ్చు. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. తోడు కోసం ఎదురుచూడకు. నీకు నువ్వే ఫ్రెండ్‌గా మారు. అదే కనుక జరిగితే డిప్రెషన్‌లోకి వెళ్లరు’’ అని ఆయన చెప్పారు.

విజయ్‌ ఆంటోనీ, మృణాళిని రవి ప్రధాన పాత్రల్లో నటించిన లవ్‌ డ్రామా ‘రోమియో’. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకుడు. ప్రేమ,  ప్రియురాలి వల్ల ఒక వ్యక్తి ఎలాంటి ఒత్తిడికి గురవుతాడు అనే సరదా అంశాలతో ఇది సిద్ధమైంది. త్వరలో విడుదల కానుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్‌ గురు’ పేరుతో రిలీజ్‌ చేయడంపై మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి ‘లవ్‌గురు’ పర్‌ఫెక్ట్‌ టైటిల్‌. తమిళంలోనూ ఇదే టైటిల్‌ పెట్టాలనుకున్నాం. కాకపోతే, వేరే నిర్మాణ సంస్థ ఆ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించుకుంది. అందువల్ల అక్కడ ఆ పేరు ఉపయోగించడానికి వీలుపడలేదు. అందుకే తమిళంలో ‘రోమియో’ అని రిలీజ్‌ చేస్తున్నాం’’ అని హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని