Rashmika: ‘బేబీ’ ప్రీమియర్‌ చూశాక.. రష్మిక ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే..

యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘బేబీ’ (Baby) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత రష్మిక (Rashmika) భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 14 Jul 2023 14:16 IST

హైదరాబాద్‌: ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (vaishnavi chaitanya), విరాజ్‌ అశ్విన్‌ (Viraj Aswani) ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘బేబీ’ (Baby). సాయిరాజేశ్‌ దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా అంతటా మంచి టాక్‌ అందుకుంది. కాగా, గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో జరిగిన ప్రీమియర్‌లో విజయ్‌ దేవరకొండ, రాశీ ఖన్నా, మారుతితోపాటు పలువురు పాల్గొని సందడి చేశారు. నటి రష్మిక సినిమా చూసి ఉద్వేగానికి గురయ్యారు. సినిమా పూర్తయ్యాక థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన ఆమె.. కాస్త ఎమోషనల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరోవైపు, ‘బేబీ’ వీక్షించిన తర్వాత చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు నటుడు విజయ్‌ దేవరకొండ. ‘‘ఎస్‌కేఎన్‌, సాయి రాజేశ్‌.. ఈరోజు నేనెంతో గర్వంగా ఉన్నాను. అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. వైష్ణవి.. తన నటనతో ఏడిపించేసింది. ఆనంద్‌, విరాజ్‌ బాగా చేశారు. టీమ్‌ అందరి విషయంలో గర్వపడుతున్నా. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడతా’’ అని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని