Vijay Varma: ఇలాంటి పాత్రలో మొదటిసారి నటించినందుకు ఆనందంగా ఉంది: విజయ్‌ వర్మ

హీరో విజయ్ వర్మ (Vijay Varma) నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ కాల్‌కూట్‌ (Kaalkoot). జులై 27నుంచి జియో సినిమా వేదికగా ఇది ప్రసారం కానుంది.

Updated : 20 Jul 2023 11:06 IST

ముంబయి: ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’(MCA) సినిమాతో తెలుగు వారికి చేరువయ్యారు నటుడు విజయ్‌ వర్మ (Vijay Varma). హైదరాబాద్‌కు చెందిన ఈ నటుడు బాలీవుడ్‌లో వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ అలరిస్తున్నారు. ఇటీవలే ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ (Lust Stories 2), దహాద్ (Dahaad) వెబ్‌ సిరీస్‌లతో పలకరించిన ఈ హీరో మరికొన్ని రోజుల్లో కాల్‌కూట్‌ (Kaalkoot) అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఎక్కువగా నెగెటివ్‌ పాత్రల్లో కనిపించిన విజయ్‌ వర్మ ఇందులో తొలిసారి పాజిటివ్‌ పాత్రతో అలరించనున్నారు. బాధ్యతగల పోలీసు అధికారిగా దీనిలో కనిపించనున్నట్లు ఆయన తెలిపారు. సుమిత్‌ సక్సేన దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ జులై 27 నుంచి జియో సినిమా వేదికగా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

  • ఓటీటీలో గత వేసవి నుంచి నెలకోసారి విజయ్‌ వర్మ పేరు కనిపిస్తూనే ఉంది. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ..‘‘గతంలో ఒక ఏడాదంతా నాకు ఎలాంటి అవకాశాలు లభించలేదు. నాకు ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి. 2022 సంవత్సరంలోనూ నేను నటించిన సినిమా ఒకటి మాత్రమే విడుదలైంది. ఇక 2023ను ఎప్పటికీ మర్చిపోలేను ఇప్పటికే రెండు సిరీస్‌లు విడుదలయ్యాయి. మరొకటి సిద్ధంగా ఉంది. ఇంకొన్ని లైన్‌అప్‌లో ఉన్నాయి’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.

వెబ్‌సిరీస్‌గా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ అన్‌రిపోర్టెడ్‌

  • ‘కాల్‌ కూట్‌’ విడుదల గురించి విజయ్ మాట్లాడుతూ..‘‘కాల్‌కూట్‌ సిరీస్‌.. జియో ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వేదిక అయితేనే ఎక్కువ మంది ప్రేక్షకులకు ఇది చేరువవుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలన్నింటి కంటే ఇదే బెస్ట్‌’’ అన్నారు.
  • ఇక ఇందులో తన పాత్ర గురించి విజయ్‌ సరదాగా స్పందించారు.‘‘నేను ఇప్పటి వరకు ఎక్కువగా నెగెటివ్ పాత్రలే చేశాను. తొలిసారి మంచి పోలీస్‌గా కనిపించనున్నాను. గొప్ప పోలీస్‌ డ్రామాగా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందని భావిస్తున్నాను’’ అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
  • కాల్‌కూట్‌లో పాత్రను అంగీకరించడంపై మాట్లాడుతూ..‘‘సుమిత్‌ సక్సేన ఈ కథను చెప్పగానే నేను వెంటనే అంగీకరించాను. నా పాత్ర అంతగా ఆసక్తి కలిగించింది. ఒక కేసు కోసం మూడు నెలల్లోనే పోస్టుకు రాజీనామా చేసిన పోలీసు పాత్ర అది. తాను చిక్కుకున్న కేసు నుంచి ఎలా బయటపడతాడో చూపించారు’’ అని వివరించారు. ఒక అమ్మాయిపై జరిగిన యాసిడ్‌ దాడి ప్రధానాంశంగా కాల్‌కూట్‌ (Kaalkoot) సిరీస్‌ సాగుతుందని విజయ్ వర్మ చెప్పారు. ఎనిమిది ఎపిసోడ్‌లుగా ఇది అలరించనుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని