The Kashmir Files: వెబ్‌సిరీస్‌గా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ అన్‌రిపోర్టెడ్‌

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ కథను వెబ్‌సిరీస్‌ రూపంలో తీసుకురానున్నట్లు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తెలిపారు. దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

Published : 19 Jul 2023 17:02 IST

హైదరాబాద్‌: ఎన్నో వివాదాల మధ్య గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files). బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) మరో తాజా అప్‌డేట్‌ ఇచ్చారు. మరి కొన్ని అంశాలను వెబ్‌ సిరీస్‌ రూపంలో ప్రేక్షకులకు అందించనున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

‘‘కశ్మీరీ పండితుల మారణ హోమం జరిగిందనే వాస్తవాన్ని అంగీకరించలేని వారు, భారత్‌కు శత్రువులు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాను ప్రశ్నించారు. ఇప్పుడు నేను కశ్మీర్‌ హిందువుల మారణ హోమానికి సంబంధించిన చేదు నిజాన్ని వెబ్‌ సిరీస్‌ రూపంలో మీ ముందుకు తీసుకురానున్నాను. భావోద్వేగాలతో కూడిన ఈ సిరీస్‌ను చూడడానికి సిద్ధంగా ఉండండి. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని కూడా అంగీకరించలేని వారు మాత్రమే దీన్ని విమర్శిస్తారు’ అని చెప్పారు. #KashmirUNREPORTED పేరుతో ఈ వెబ్‌ సిరీస్‌ను తీసుకురానున్నట్లు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 వేదికగా ఇది స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

‘ప్రాజెక్ట్‌ కె’.. ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ అదిరింది

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా కోసం వివేక్‌ అగ్నిహోత్రి రెండేళ్లపాటు పరిశోధన చేశారు. కశ్మీర్‌ రాష్ట్రం దాటి వెళ్లిపోయిన ఏడువందల మంది కశ్మీరీ పండితులను ఇంటర్వ్యూ చేసినట్లు గతంలో తెలిపారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూల్లో వ్యక్తులు పంచుకున్న విషయాలనే వెబ్ సిరీస్‌లో చూపించనున్నట్లు తాజాగా విడుదలైన వీడియోలో తెలుస్తోంది. 1990ల్లో జమ్మూ-కశ్మీర్‌లో చేలరేగిన ఉగ్రవాదంలో ప్రాణాలు కోల్పోయిన పండితుల కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని