Liger: నాతో రండి.. పోరాటం చేద్దాం: విజయ్ దేవరకొండ

‘లైగర్‌’ (Liger) సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ విడుదలైంది. ‘వాట్‌ లగా దెంగే’ అంటూ సాగే ఈ పాట..

Published : 29 Jul 2022 10:19 IST

‘లైగర్‌’ సెలబ్రేషన్స్‌ షురూ.. మాస్‌ సాంగ్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: ‘లైగర్‌’ (Liger) సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి సెకండ్‌ సాంగ్‌ విడుదలైంది. ‘వాట్‌ లగా.. ’ అంటూ సాగే ఈ పాట.. విజయ్‌ మాస్‌ డైలాగ్స్‌తో సిద్ధమైంది. ‘‘వి ఆర్‌ ఇండియన్స్‌. మేము ఎవరికీ తీసిపోం. సోదరి నాతో రా.. మనం వెళ్దాం.. పోరాటం చేద్దాం’’ అంటూ పాట ప్రారంభంలో విజయ్‌ ఆగ్రహంతో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒకటిన్నర నిమిషంపాటు సాగిన ఈ వీడియో సాంగ్‌లో విజయ్‌.. తన ప్రత్యర్థిపై పోరాటం చేస్తున్న దృశ్యాలు చూపించారు.

కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్‌’. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. ఇందులో విజయ్ ముంబయి మురికివాడకు చెందిన యువకుడిగా, ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన పాత్ర నత్తితో ఇబ్బందిపడే వ్యక్తిగా రూపుదిద్దుకుంది. ఆయన తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అనన్యా పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌ కీలకపాత్ర పోషించారు. విజయ్‌ దేవరకొండ నటించిన మొదటి పాన్‌ ఇండియా సినిమా ఇది. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆగస్టు 25న విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని