War2: రా ఏజెంట్‌గా ఎన్టీఆర్‌?

‘వార్‌ 2’ కోసం ఎన్టీఆర్‌ రంగంలోకి దిగే సమయం వచ్చింది. వచ్చే నెలలోనే ఆయన ఈ సినిమా సెట్లోకి అడుగు పెట్టే అవకాశాలున్నాయని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated : 06 Mar 2024 09:31 IST

‘వార్‌ 2’ కోసం ఎన్టీఆర్‌ రంగంలోకి దిగే సమయం వచ్చింది. వచ్చే నెలలోనే ఆయన ఈ సినిమా సెట్లోకి అడుగు పెట్టే అవకాశాలున్నాయని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న చిత్రమే ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.  బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ వారంలో చిత్రీకరణని ప్రారంభించనున్నారు. హృతిక్‌ రోషన్‌పై కీలక సన్నివేశాల్ని జపాన్‌లో తెరకెక్కిస్తారని సమాచారం. ఆ తర్వాత షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ రంగంలోకి దిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.  ఇందులో ఎన్టీఆర్‌ పోషించనున్న పాత్రపై పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఇండియన్‌ రా ఏజెంట్‌ పాత్రలో ఆయన కనిపిస్తారని, ఆ పాత్ర భవిష్యత్తులో తరచూ తెరపై కనిపిస్తూనే ఉంటుందని, ఆ నేపథ్యంలో సోలోగా ఓ సినిమా కూడా రూపొందనుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ‘దేవర’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు ఎన్టీఆర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని