Little Miss Naina: ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న క్యూట్‌ లవ్‌ స్టోరీ ‘లిటిల్‌ మిస్‌ నైనా’

Little Miss Naina ott release: మలయాళ లవ్‌స్టోరీ ‘లిటిల్‌ మిస్‌ నైనా’ పేరుతో ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Published : 27 Jan 2024 15:42 IST

హైదరాబాద్‌: చిన్న చిన్న కథలతో ప్రేక్షకుల హృదయాలను రంజింపజేసేలా ఉంటాయి మలయాళ చిత్రాలు. గతేడాది అక్టోబరులో విడుదలైన అలాంటి చిత్రమే ‘లిటిల్‌ మిస్‌ రాథర్‌’ (Little Miss Rawther). గౌరీ జి కిషన్‌, షేర్షా షరీఫ్ కీలక పాత్రలు పోషించారు. విష్ణు దేవ్‌ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు ఓటీటీ ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా ‘లిటిల్‌ మిస్‌ నైనా’ (Little Miss Naina) పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది.

కథేంటంటే: మత సంప్రదాయాలను పాటించే మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి నైనా (గౌరీ).  ఆమెకు కాలేజీలో అభిజిత్ (షేర్షా) పరిచయమవుతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అభిజిత్‌ పొడుగ్గా ఉంటే, నైనా హైట్‌ తక్కువ. దీంతో ఇద్దరి మధ్య ఎత్తు విషయంలో ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. సినిమా అవకాశాలు రావడంతో అభిజీత్‌ బిజీ అయిపోతాడు. అప్పుడే నైనా వేరొకరితో పెళ్లికి రెడీ అవుతోందని అతడికి తెలుస్తుంది. దీంతో ఆ బాధను తట్టుకోలేక, మద్యానికి బానిస అవుతాడు. పెళ్లికి ముందు రోజు మాట్లాడాలని చెప్పి అభిజీత్‌ను పిలుస్తుంది నైనా. తన ప్రేమను అంగీకరించాలని అభిజిత్‌ కోరడంతో అతడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. ఇద్దరూ ఇంటి నుంచి పారిపోవాలనుకుంటారు. ఈ నిర్ణయం కారణంగా ఇద్దరూ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని