Salaar: ‘పఠాన్‌’, ‘జవాన్‌’ బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ను ‘సలార్‌’ బ్రేక్‌ చేస్తుందా..?: నిర్మాత ఏమన్నారంటే..!

షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన ‘పఠాన్‌’, ‘జవాన్‌’ సినిమా వసూళ్ల రికార్డులను ‘సలార్‌’ (Salaar) అధిగమిస్తుందా? అనే విషయంపై చిత్ర నిర్మాత స్పందించారు. ఈ సినిమా నుంచి తాము భారీ వసూళ్లను ఆశిస్తున్నట్లు తెలిపారు.

Updated : 18 Dec 2023 20:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పఠాన్‌’ (Pathaan), ‘జవాన్‌’ (Jawan) బాక్సాఫీస్‌ రికార్డులను త్వరలో విడుదల కానున్న ‘సలార్‌’ (Salaar) బ్రేక్‌ చేస్తుందా? అనే విషయంపై చిత్ర నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ స్పందించారు. ఈ సినిమా సుమారు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని తాము భావిస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

‘‘కేజీయఫ్‌’, ‘సలార్‌’ లాంటి పెద్ద చిత్రాలను విడుదల చేసినప్పుడు తప్పకుండా భారీ కలెక్షన్స్‌ ఆశిస్తాం. అదే విధంగా ఈ చిత్రానికి సుమారు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని అనుకుంటున్నాం. అనుకున్నవిధంగా చిత్రాన్ని పూర్తి చేశాం. మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నాం. కాబట్టి ఇప్పుడు మేము భారీ నంబర్లు ఆశిస్తున్నాం. ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రభాస్‌ యాక్షన్‌ అవతార్‌లో కనిపించండం అద్భుతంగా ఉంటుంది. ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను ఒకే స్క్రీన్‌పై చూడాలని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు’’ అని ఆయన అన్నారు. ‘డంకీ’తో పోటీపై స్పందిస్తూ.. ‘డంకీ’, ‘సలార్‌’ క్లాష్‌ అనేది తప్పక ఉందని.. రెండు చిత్రాలకూ థియేటర్స్‌ దొరుకుతాయని ఆశిస్తున్నానని చెప్పారు.

యాక్షన్‌ ప్యాక్డ్‌గా ‘సలార్‌’ రిలీజ్‌ ట్రైలర్‌..!

‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలతో ఈ ఏడాది వరుస విజయాలు అందుకున్నారు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan). ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుని రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరాయి. ‘జవాన్‌’ తర్వాత షారుక్‌ నటించిన ‘డంకీ’ విడుదలకు సిద్ధమైంది. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని