Samantha: సల్మాన్‌తో నటిస్తుందా?

హిందీ చిత్రసీమని ఆకర్షించడంలో ముందున్నారు దక్షిణాది కథానాయికలు. అక్కడే  ఒకరిని మించి మరొకరు స్టార్‌ భామలు ఉన్నప్పటికీ...

Updated : 16 Sep 2023 13:51 IST

హిందీ చిత్రసీమని ఆకర్షించడంలో ముందున్నారు దక్షిణాది కథానాయికలు. అక్కడే  ఒకరిని మించి మరొకరు స్టార్‌ భామలు ఉన్నప్పటికీ... దక్షిణాది కథానాయికలు తరచూ  అదిరిపోయే అవకాశాల్ని సొంతం చేసుకొంటున్నారు. ఇటీవలే ‘జవాన్‌’తో మెరిసింది నయనతార. రష్మిక అక్కడ అవకాశాల్ని సొంతం చేసుకొంటూనే ఉంది. తాజాగా సమంత విషయంలోనూ బాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలో సమంత నటిస్తుందనే ప్రచారమే ఆ చర్చకి కారణం. విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. అందులో దక్షిణాది కథానాయికనే తనకి జోడీగా నటించాలనేది సల్మాన్‌ నిర్ణయమని సమాచారం. ఆ మేరకు సమంత పేరు ప్రచారంలోకి వచ్చింది. అంతకుముందు త్రిష పేరు కూడా వినిపించింది. మరి అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. ‘ఖుషి’తో ఇటీవలే విజయాన్ని సొంతం చేసుకుంది సమంత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని