Yami Gautam: ‘గదర్‌2’ కటౌట్‌ దగ్గర ఫొటో.. వివరణ ఇచ్చిన యామీ గౌతమ్‌

‘ఓమైగాడ్‌2’ (OMG 2) , ‘గదర్‌2’ (Gadar 2) సినిమాలు ఇటీవల విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.  ‘ఓమైగాడ్‌2’లో కీలక పాత్ర పోషించిన యామీ గౌతమ్‌ ‘గదర్‌2’ కటౌట్‌ దగ్గర ఫొటో దిగడంపై వివరణ ఇచ్చారు.

Published : 17 Aug 2023 16:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) నటించిన ‘ఓ మైగాడ్‌2’ (OMG 2) చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకర్షిస్తోంది. ఇందులో యామీ గౌతమ్‌ (Yami Gautam) న్యాయవాదిగా కనిపించారు. ఇక ఇదే సమయంలో సన్నీ దేఓల్‌ (Sunny Deol) నటించిన ‘గదర్‌2’ (Gadar 2) కూడా విడుదలై మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది. తాజాగా నటి యామీ గౌతమ్‌ ‘గదర్‌2’ కటౌట్‌ దగ్గర ఓ ఫొటో దిగి.. దాన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. దీంతో కొందరు నెటిజన్లు ‘మీరు ఈ సినిమాలో నటించక పోయినా ఎందుకు ప్రమోట్‌ చేస్తున్నారు’ అని కామెంట్స్‌ చేశారు.

దీనిపై యామీ గౌతమ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు..‘‘ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్‌ చేస్తే తప్పేముంది. ‘ఓమైగాడ్‌2’ సినిమా చూసి వస్తుంటే.. ‘గదర్‌2’ కటౌట్‌ కనిపించింది. అది నాకెంతో నచ్చింది. అందుకే ఫొటో దిగాను. సన్నీ దేఓల్‌  అంటే నాకెంతో అభిమానం.  ఆయన సినిమాలు చూస్తు పెరిగాను. నేను ఓ అభిమానిగా వెళ్లి ఫొటో దిగాను కానీ, ఓ నటిలా కాదు. ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో వచ్చినా.. రెండూ ప్రేక్షకాదరణ పొందాయి. మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ విషయంలో నాకెంతో సంతోషంగా ఉంది. అయినా ఇండస్ట్రీలో రెండు సినిమాల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. అలా పోటీ ఉండాలని ఏ దర్శకనిర్మాతలు అనుకోరు. మంచి సినిమా ఏ సమయంలో వచ్చినా అది విజయం సాధిస్తుంది’’ అని అన్నారు. 

ప్రమోషన్స్‌లో నయా ట్రెండ్‌.. ప్రచారం కావాలంటే స్టేజ్‌పై కెమిస్ట్రీ పండాల్సిందే..!

ఇక మరోవైపు తన సినిమాను ఆదరించినందుకు అక్షయ్‌ కుమార్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ‘గదర్‌2’ పేరు కూడా కలిసి వచ్చేలా ట్వీట్‌ చేశారు. ‘ఓ మై గదర్‌కు మంచి విజయాన్ని అందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారతీయ చలనచిత్ర చరిత్రలో మాకు గొప్ప వారాన్ని అందించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని