అభిమాని ఆత్మహత్య.. హీరో ఆగ్రహం

క్షణికావేశంలో తన అభిమాని తీసుకున్న నిర్ణయంపట్ల కన్నడ స్టార్‌హీరో యశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానుల ప్రేమకు ఇది అసలైన అర్థం కాదని ఆయన అన్నారు. కర్ణాటకలోని మండ్యా జిల్లాకు చెందని రామకృష్ణ(25) అనే వ్యక్తి గురువారం సాయంత్రం ఇంట్లో ...

Updated : 19 Feb 2021 17:13 IST

బెంగళూరు: క్షణికావేశంలో తన అభిమాని తీసుకున్న నిర్ణయంపట్ల కన్నడ స్టార్‌హీరో యశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానుల ప్రేమకు ఇది అసలైన అర్థం కాదని ఆయన అన్నారు. కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన రామకృష్ణ(25) అనే వ్యక్తి గురువారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, చనిపోవడానికి ముందు రామకృష్ణ రాసిన సూసైడ్‌ నోట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. వ్యక్తిగతంగా తాను ఎన్నో కోల్పోయానని.. కుటుంబాన్ని సంతోషంగా చూసుకోలేకపోయానని బాధితుడు ఆ లేఖలో రాసుకొచ్చాడు. అంతేకాకుండా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, స్టార్‌హీరో యశ్‌కు తాను వీరాభిమానినని, అంత్యక్రియలకు వాళ్లిద్దరూ రావాలని, అదే తన చివరి కోరిక అని పేర్కొన్నాడు.

కాగా, తాజాగా రామకృష్ణ మరణం వార్తపై యశ్‌ ట్వీట్‌ పెట్టారు. ‘అభిమానులు చూపించే ప్రేమే మా జీవితం. మా గౌరవం. రామకృష్ణ చూపించిన ప్రేమను మనం గర్వంగా చెప్పుకోగలమా?అభిమానుల ప్రేమకు ఇది ఎప్పటికీ ఉదాహరణ కాకూడదు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.’ అని యశ్‌ అన్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న సిద్ధరామయ్య రామకృష్ణ ఇంటికి చేరుకుని తుది నివాళి అర్పించారు. అతని కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆత్మహత్య చేసుకోకూడదని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని