చారిత్రాత్మకం జ్యోతిర్లింగం శివపదం లాస్యం
ప్రముఖ ప్రవచన కర్త, ఆధ్యాత్మిక గురువు సామవేదం షణ్ముఖశర్మ తెలుగు, సంస్కృత భాషలలో 1100 పైగా శివపదం కీర్తనలు రచించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో ద్వాదశ జ్యోతిర్లింగ సాహిత్యం కూడా ఒకటి. శివపద సంగీత, నాట్య ప్రదర్శనలు దేశ విదేశాలలో ఎన్నో జరిగాయి. తాజాగా గురు పౌర్ణమిని పురస్కరించుకుని ద్వాదశ జ్యోతిర్లింగాల విశిష్టత అందరికీ తెలిసేలా ఏడు వైవిధ్య శాస్త్రీయ నృత్య రీతుల ప్రదర్శన జరిగింది. అమెరికా, రష్యాలలోని 11 నృత్య శిక్షణాలయాల నుంచి 58 మంది గురు-శిష్యుల బృందం, నయనా నందకరంగా ఆంధ్ర నాట్యం, కూచిపూడి, భరతనాట్యం, మోహినియాట్టం, మణిపురి, ఒడిస్సి , కథక్ నృత్య రీతులను సమ్మోహనకరంగా ప్రదర్శించారు.
రుషి పీఠం యూట్యూబ్ మాధ్యమంగా జరిగిన నృత్య ప్రదర్శన విశేషంగా అలరించింది. శివపదాంకిత అంటూ వాణీ గుండ్లపల్లి, రవిగుండ్లపల్లిలను సామవేదం షణ్ముఖశర్మ అభినందించారు. శివపదం బృందం కలిసి మహత్ నృత్య కార్యక్రమాన్ని మహోన్నతంగా నిర్వహించారు. మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథుడి ఆవిర్భావ ఘట్టం నుంచి ద్వాదశ జ్యోతిర్లింగాల కీర్తనలపై అద్భుతమైన నృత్యంతో కనుల ముందు ఆయా దివ్య జ్యోతిర్లింగ క్షేత్రాలని ఆవిష్కరింపచేశారు. ద్వాదశజ్యోతిర్లింగ గాథల కీర్తనలోని పల్లవిని వివిధ నాట్యశైలుల గురువులందరూ కలిసి ప్రదర్శించారు.
కూచిపూడి- రాజేష్ శిష్య బృందం;
భరతనాట్యం- చందన శిష్య బృందం, నైనా శిష్య బృందం;
ఒడిస్సీ- బిధీష శిష్య బృందం, సీమ శిష్య బృందం;
మోహినియట్టం -సరస్వతి శిష్య బృందం;
ఆంధ్ర నాట్యం - హేమ శిష్య బృందం;
మణిపురి - మిత్ర శిష్యబృందం;
కథక్ - ప్రగ్యా, దీపన్విత శిష్య బృందం;
నృత్యసభ ఫౌండేషన్, రష్యా - గురుశిష్య బృందం అద్భుతంగా ప్రదర్శించారు. షణ్ముఖశర్మ సమన్వయ వ్యాఖ్యానంతో సాగిన నృత్యరూపకం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల శివపద సాహిత్యం, నాట్యప్రదర్శన చూడటం తమ అదృష్టమని, శివపద నృత్య రూపకం ఆద్యంతం ఒక అద్భుతం అమెరికాకు చెందిన రాధికా కామేశ్వరి వంటి వారు ప్రశంసల జల్లు కురిపించారు. 2016లో షణ్ముఖశర్మ రచించిన ద్వాదశ జ్యోతిర్లింగ సాహిత్యాన్ని లాల్‌గుడి, బ్రహ్మానందం, అనురాధ తదితరులు ఎంతో హృద్యంగా స్వరపరిచారు. యూఎస్‌లో పుట్టి పెరిగిన యువత మృదు మధురంగా ఆలపించడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Anupama Parameswaran: పబ్లిక్‌లో రాజమౌళి కాళ్లకు నమస్కరించిన అనుపమ
-
Politics News
Telangana News: అక్కడెందుకు సీఎం కేసీఆర్ పర్యటించలేదు?: కోదండరామ్
-
India News
Modi: మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!
-
Crime News
Telangana News: కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
-
Sports News
Team india: ఆ ఇద్దరిలో ఎవరిని తుదిజట్టులో ఆడిస్తారో.. : మాజీ క్రికెటర్
-
Politics News
Revanth Reddy: మునుగోడు పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!