రాష్ట్రపతి అవార్డు గ్రహిత వయలిన్ వాసుతో నాట్స్ ఇష్టాగోష్టి

అమెరికాలో ప్రవాస తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్)  తాజాగా ‘నాట్స్ తెలుగు లలిత కళా వేదిక’ ద్వారా ప్రతి నెలా అంతర్జాలం వేదికగా వెబినార్లు నిర్వహిస్తోంది.

Published : 28 Dec 2023 19:02 IST

వాషింగ్టన్‌: అమెరికాలో అనేక కార్యక్రమాలు చేపడుతోన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్)  తాజాగా ‘నాట్స్ తెలుగు లలిత కళా వేదిక’ ద్వారా ప్రతి నెలా అంతర్జాలం వేదికగా వెబినార్లు నిర్వహిస్తోంది. రాష్ట్రపతి అవార్డు గ్రహిత వయలిన్ వాసుతో తాజాగా నాట్స్ ఇష్టాగోష్టి నిర్వహించింది.  భారతదేశంతో పాటు అనేక దేశాల్లో సంగీత, సాంస్కృతిక సదస్సుల్లో పాల్గొని ఎన్నో పురస్కారాలు అందుకొన్న వయలిన్‌ వాసు తన అనుభవాలను పంచుకున్నారు. సంప్రదాయ కళల పరిరక్షణ కోసం వయలిన్ వాసు చేసిన కృషి అమోఘమని ఈ ఇష్టాగోష్టి వ్యాఖ్యతగా వ్యవహరించిన శాయి ప్రభాకర్ యర్రాప్రగడ కొనియాడారు. మనస్సును కదిలించే శక్తి సంగీతానికి ఉందని.. ముఖ్యంగా వయలిన్‌ ద్వారా మనస్సులో భావాలను సంగీత రూపంలో చెప్పవచ్చని వాసు తెలిపారు. అసలు తాను సంగీత ప్రపంచంలోకి ఎలా  అడుగుపెట్టింది? తర్వాత ఈ రంగంలో చేసిన కృషిని వివరించారు. 

తాను నేర్చుకున్న సంగీత పరిజ్ఞానాన్ని వీలైనంత ఎక్కువ మందికి పంచడమే తన లక్ష్యమని వయలిన్‌ వాసు తెలిపారు.  కొత్తగా సంగీతం నేర్చుకోవాలనుకునే వారు ఎలా ఉండాలి? వారు ఎలా కృషి చేయాలనేది విషయాలను వివరించారు. వయలిన్  వాయించి నాట్స్ సభ్యులను అలరించారు. నాట్స్ లలిత కళా వేదిక ద్వారా తెలుగు కళలను ప్రోత్సాహిస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి అన్నారు. అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నాట్స్ తన వంతు కృషి చేస్తుందని తెలిపారు. నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా తెలుగు వారికి ఎలా అండగా నిలబడుతున్నదీ ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ వ్యవహరించారు.  ఈ ఇష్టాగోష్టికి ఆహ్వానించగానే వచ్చిన వయలిన్ వాసుకు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని