మువ్వన్నెల రంగుల్లో మెరిసిన సిడ్నీ ఒపేరా హౌస్‌.. ఆస్ట్రేలియాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మన దేశంలోని ప్రజలతో పాటు విదేశాల్లోని ప్రవాస భారతీయులూ ఘనంగా జరుపుకొంటున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని పలు నగరాలు, ముఖ్య ప్రదేశాల్లో.....

Published : 15 Aug 2022 22:25 IST

సిడ్నీ‌: భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మన దేశంలోని ప్రజలతో పాటు విదేశాల్లోని ప్రవాస భారతీయులూ ఘనంగా జరుపుకొంటున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని పలు నగరాలు, ముఖ్య ప్రదేశాల్లో ప్రవాసీయులు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అక్కడ అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లోని భారత్‌ కాన్సులేట్‌ అధికారుల ఆధ్వర్యంలో హైకమిషనర్‌ జెండా ఎగురవేసి ఎన్నారైలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని ప్రదేశాల్లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన హార్బర్‌ బ్రిడ్జి, ప్రముఖ క్రికెట్‌ మైదానం అడిలైడ్‌ ఓవల్‌ స్టేడియాన్ని మువ్వన్నెల జెండా రంగులతో అలంకరించారు. అలాగే, భారత్‌లో ఈ చారిత్రక సందర్భానికి గుర్తుగా తొలిసారి ప్రఖ్యాత సిడ్నీ ఒపేరా హౌస్‌ త్రివర్ణ వెలుగుల్లో మెరిసిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని