ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు బాడీ కెమెరాలు

అమెరికాలోని హోంల్యాండ్‌ సెక్యూరిటీకి చెందిన ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు ఇకపై బాడీ కెమెరాలు ధరించనున్నారు.

Published : 24 Dec 2021 20:09 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని హోంల్యాండ్‌ సెక్యూరిటీకి చెందిన ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు ఇకపై బాడీ కెమెరాలు ధరించనున్నారు. నేర విచారణతో పాటు ఐసీఈ ఏజెంట్ల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఈ కెమెరాలు దోహదం చేయనున్నాయి. పైలట్‌ ప్రాజెక్టుగా న్యూయార్క్‌ సిటీ, నెవార్క్‌, న్యూజెర్సీ, హ్యూస్టన్‌, టెక్సాస్‌ నగరాల్లోని కొందరు ఏజెంట్లకు ఈ బాడీ కెమెరాలు అమర్చనున్నట్లు హోంల్యాండ్‌ సెక్యూరిటీకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

అమెరికాకు వలస వచ్చే వారి పట్ల ఐసీఈ ఏజెంట్లు అక్రమంగా అరెస్టులు చేస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం బాడీ కెమెరాల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఈ ఓ ప్రకటనలో తెలపడం గమనార్హం. అరెస్టులు, అనుమానితులను విచారించడం, సెర్చ్‌వారెంట్ల సమయంలో బాడీ కెమెరాలను ఏజెంట్లు వినియోగించనున్నారు. ఆరు నెలల పాటు ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టనున్నారు. సాంకేతికత వినియోగం వల్ల లాభనష్టాలను బేరీజు వేసుకుని పూర్తి స్థాయిలో వినియోగానికి శ్రీకారం చుట్టనున్నారు. అమెరికాలో డ్రగ్స్‌, మానవ అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టడానికి ఐసీఈ పనిచేస్తుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని