Family Star: అమెరికాలో ‘ఫ్యామిలీ స్టార్‌’ షూట్‌.. సెట్‌లో ప్రవాస తెలుగువారు సందడి

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ అమెరికాలో జరుగుతోంది.

Updated : 28 Dec 2023 20:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). పరశురామ్‌ దర్శకుడు. గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమా షూట్‌ న్యూయార్క్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా న్యూయార్క్‌, లాంగ్‌ ఐలాండ్‌లో నివసిస్తోన్న ప్రవాస తెలుగుప్రజలు ‘ఫ్యామిలీ స్టార్‌’ టీమ్‌ను కలిశారు. నటీనటులు, ఇతర చిత్రబృందంతో సరదాగా మాట్లాడారు. వారితో ఫొటోలు దిగారు. తమ కోసం సమయాన్ని కేటాయించిన విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, వెన్నెల కిషోర్‌, పరశురామ్‌తోపాటు ఇతర టీమ్‌కు వారు ధన్యవాదాలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని