TDP: ఏపీలో ఎన్నారై తెదేపా అసెంబ్లీ కోఆర్డినేటర్ల నియామకం

శాసనసభ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఎన్నారై టీడీపీ అమెరికా విభాగం నియోజకవర్గాల వారీగా కో ఆర్డినేటర్ల నియామకాలను చేపట్టింది. ఎన్ఆర్‌ఐ టీడీపీ అమెరికా కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరిగాయి.

Updated : 21 Dec 2023 00:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శాసనసభ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఎన్నారై తెదేపా అమెరికా విభాగం నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల నియామకాలను చేపట్టింది. ఎన్ఆర్‌ఐ తెదేపా అమెరికా కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరిగాయి. ఎన్నారై తెదేపా నిర్దేశించిన బాధ్యతలు, విధులను అసెంబ్లీ సమన్వయకర్తలు నిర్వహించనున్నారు. వీరందరికీ జయరాం కోమటి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నారై తెదేపా తరఫున ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని అన్నారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎన్నారై తెదేపా సమన్వయకర్తలు, సభ్యులు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నారై తెదేపా అమెరికా ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా పలు కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లు.. 
 

చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం

  • చంద్రగిరి-హేమ కుమార్ గొట్టి, జీవన్ నారా, జయంత్ బొల్లినేని, నాగార్జున.ఎస్‌
  • పూతలపట్టు- సునీల్ పంత్ర, సంఘమిత్ర గంగవరపు, చరణ్ గుడివాడ
  • చిత్తూరు-రవితేజ ముత్తు, చంద్ర అల్లు, గంగాధర
  • నెల్లూరు-కిషన్ గురసాల
  • నగరి-పురుషోత్తం అయినేని, ప్రతాప్ మేదరమిట్ట, నేతాజీ గుర్రం, దేవరాజ్ నరాల
  • కుప్పం-ప్రతిమ తాళ్లపాక, సుకుమార్ దొడ్ల  

నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం

  • వినుకొండ-రామకృష్ణ మాదాల, వెంకట్ కోనేరు, ప్రతాప్ వీరవల్లి, వంశీ పావులూరి
  • మాచర్ల- వెంకట్ తక్కెళ్ళపాటి
  • గురజాల-నరసింహారావు ముక్కపాటి, సతీష్ ఏల్చూరి
  • సత్తెనపల్లి-శ్రీహరి మందాడి, రామ సుధాకర్ నిమ్మగడ్డ, భాను మాగులూరి
  • నరసరావుపేట-చంద్ర కొండపల్లి
  • చిలకలూరిపేట-వెంకట్ మద్దుకూరి, ప్రసాద్ జాస్తి
  • పెదకూరపాడు-భాను మాగులూరి  

మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం

పామర్రు- అనిల్ వీరపనేని, రావు ద్రోణవల్లి, అనిల్ ఉప్పలపాటి, నిఖిల్ సూరపనేని, సత్య చిగురుపాటి, శ్రీమాన్ యార్లగడ్డ 

రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం 

  • గోపాలపురం-సతీష్ గన్నమనేని, సునీల్ మద్దిపట్ల
  • నిడదవోలు-సీతారాం కోమట్లపల్లి, రామ్ వంకిన
  • కొవ్వూరు-సుమంత్ పుసులూరి
  • అనపర్తి-రవి కాకర
  • రాజమండ్రి రూరల్-అశోక్ సుంకవల్లి
  • రాజమండ్రి సిటీ-విశ్వనాథ్ కోగంటి
  • రాజానగరం-విజయ్ మద్దిపాటి, మురళి మర్ని 

ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం 

  • కైకలూరు-సుమన్ కనగాల, సాయి మహేంద్ర చిలుకూరి
  • నూజివీడు-వంశీ బొట్టు, ప్రవీణ్.పి, కార్తీక్ గోగినేని
  • చింతలపూడి-సుబ్బారావు బొప్పన, శివ ఏలూరు, బాలకృష్ణ తుమ్మల, విజయ్ ఘంటా
  • పోలవరం-జాలాకృష్ణ ఆలపాటి, ఈడుపుగంటి కిషోర్,
  • ఏలూరు-సుభాష్ సుంకర
  • దెందులూరు-గుత్తా రమేష్ బాబు, హరీష్ కొడాలి, గుత్తా హరిణి
  • ఉంగుటూరు-సునీల్ మద్దిపట్ల 

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం

  • ఆత్మకూరు-సుధీర్ కొమ్మి, మురళీ చంద్ర
  • కావలి-తేజ్ మన్నవ
  • నెల్లూరు రూరల్-అఖిల్ శాఖమూరి, రాంబాబు జవ్వాజి,
  • నెల్లూరు సిటీ-ప్రమోద్ నూతేటి, భరత్ ముత్తిరాల
  • కందుకూరు-రామకృష్ణ దామా, భాను ఆకర్ష్ వాలేటి
  • ఉదయగిరి-మహేంద్ర బాబు గడ్డం 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని