చికాగోలో వైభవంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు

ట్రై-స్టేట్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు చికాగోలో ఉత్సాహంగా జరిగాయి.

Published : 17 Apr 2023 22:28 IST

చికాగో: అమెరికాలోని చికాగోలో ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 15న స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ లేక్ కౌంటీ ఆలయ ప్రాంగణంలో సంస్థ అధ్యక్షులు హేమచంద్ర వీరపల్లి ఆధ్వర్యంలో ఈ పండుగలను వైభవంగా జరుపుకొన్నారు. సోమలత ఎనమందల, హేమంత్ పప్పు, ప్రసాద్ మరువాడ,  ప్రశాంతి తాడేపల్లి ఆధ్వర్యంలో స్వప్న పులా, అర్చన మిట్ట, రేఖ వేమూరి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఉల్లాసంగా కొనసాగించారు. ప్రణతి కలిగొట్ల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సుస్మిత గన్‌రెడ్డి సహకారంతో హేమంత్ పప్పు, సోమలత ఎనమందల, సందీప్ గడ్డం , రామ్ శరబు అద్భుతంగా అలంకరించిన వేదిక ప్రేక్షకులకు కనులవిందు చేసింది. 

ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు జగదీశ్ కానూరు,  శ్రీనాథ్ వాసిరెడ్డి, వీరాస్వామి అచంట, మధు ఆరంబాకం, దిలీప్ రాయలపూడి, భాను సిరమ్, గుప్త నాగుబండి ఎంతో తోడ్పాటు అందించారు. కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చిన సభ్యుల మధ్య అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సంగీత, నాట్య కార్యక్రమాలతో పాటు చిత్ర గీత నృత్యాలు, పాటలు ప్రదర్శించి అలరించారు.  ఈ కార్యక్రమానికి సుప్రియ ముప్పవరపు అందించిన అచ్చ తెలుగు ఉగాది విందు భోజనాలను ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదించారు. సాదిస్ ఇంబా శేఖర్ ఫొటో, వీడియో చిత్రీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని