17న ‘షిర్డీ సాయి గాయత్రి మహా మంత్ర జపం’.. అందరూ ఆహ్వానితులే..!

కొత్త రూపాలతో ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారి వల్ల నెలకొన్న చీకట్లను పారద్రోలడం, జ్ఞాన వెలుగుల్ని పంచడం,  ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ......

Published : 15 Dec 2021 17:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త రూపాలతో ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారి వల్ల నెలకొన్న చీకట్లను పారద్రోలడం, జ్ఞాన వెలుగుల్ని పంచడం,  ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అఖండ షిర్డీసాయి గాయత్రి మహా మంత్రజపం కార్యక్రమం ఈ నెల 17న జరగనుంది. శ్రీ షిర్డీ సాయి మహరాజ్‌ దివ్య ఆశీస్సులతో గురు వాణి బాబా ప్రేరణతో విశ్వసాయి ద్వారకామాయి శక్తిపీఠం ఆధ్వర్యంలో సాయి ఉపాసకులు, గురూజీ లక్ష్మోజీ నేతృత్వంలో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 17న కాలిఫోర్నియాలో గురు లక్ష్మోజీ నివాసంలో అఖండ దీపం వెలిగించి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. శుక్రవారం సాయంత్రం 5.54గంటల నుంచి 24గంటల పాటు నిరాటంకంగా సాయి మంత్రాన్ని జపించనున్నారు. 24గంటల పాటు నిర్విరామంగా కొనసాగే ఈ అఖండ షిర్డీసాయి మహామంత్రం సంకీర్తనలో ప్రపంచ వ్యాప్తంగా విశ్వసాయి సేవకులు పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అయితే, తమ వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరారు. వివరాలన్నీ వచ్చాక అఖండ షిర్డీసాయి మహామంత్రం జపం వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరి టైమ్‌ శ్లాట్‌లను గూగుల్‌ షీట్‌లో పొందుపరిచి జూమ్‌ లింక్‌ ద్వారా సాయి జపంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ సాయి సంకీర్తన కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని సాయి కృపను, ప్రేమను విశ్వవ్యాప్తంగా ప్రతి ధ్వనింపజేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

ఈ మహాజపం కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్ఫర్మేషన్‌, శ్లాట్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సహా ఇతర సందేహాలు, వివరాల కోసం టైమ్‌ జోన్ల వారీగా కేటాయించిన బాధ్యుల ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. భారత్‌: ఉమ- +91 96868 57733; EST USA, కెనడా: శాంతి వాఘ్రే- +1 (647) 702-9369; CST USA: సుధా దెందులూరి- +1 (952) 846-9898; PST USA: ఓం వైంకుఠం- +1 (408) 802-8674 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని