80 స్థానాల్లో గెలుస్తాం: మహేశ్‌కుమార్‌గౌడ్‌

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ 80 స్థానాలు కైవసం చేసుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ధీమా వ్యక్తంచేశారు.

Updated : 24 Sep 2023 06:33 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ 80 స్థానాలు కైవసం చేసుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ధీమా వ్యక్తంచేశారు. ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలపై ప్రతి ఇంటా చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేస్తాం. బీసీ కుల గణనకు కట్టుబడి ఉన్నాం. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఎన్నికల్లోనే అమలు చేసేది’’ అని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని