Praggnanandhaa - Amul: ప్రజ్ఞానంద తల్లికి ‘అమూల్‌’ గిఫ్ట్‌

Amul: యువ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద తల్లి నాగలక్ష్మి అమూల్‌ సంస్థ ప్రత్యేకమైన బహుమతి అందించింది. ఇటీవలే ప్రజ్ఞానంద (Praggnanandhaa) చెస్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌గా నిలిచాడు. 

Updated : 27 Aug 2023 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత యువ చెస్‌ సంచలనం, గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద (R Praggnanandhaa) చెస్‌ ప్రపంచకప్‌ (Chess World Cup) ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచి కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో ప్రజ్ఞానందతో పాటు ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది వాళ్ల అమ్మ నాగలక్ష్మి. తన కొడుకు విజయాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఆనందంతో కన్నీరు పెట్టుకున్న సందర్భాలు, ప్రజ్ఞానంద మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లలో వర్ణించలేని ఆనందం.. ఇలాంటి ఈ మధుర క్షణాలను బంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆమె పంచిన ప్రేమానురాగాలకు, అన్నింటాతోడుగా ఉండటాన్ని చూసి మురిసిపోయిన అమూల్‌ (Amul) సంస్థ ప్రత్యేకంగా ఓ కార్టూన్‌ను విడుదల చేసింది.

అమ్మే ప్రపంచం

చెస్ బోర్డు ముందర ప్రజ్ఞానంద కూర్చొని ఉండగా వాళ్ల అమ్మ బ్రెడ్‌ని తీసుకొని వచ్చి కుమారునికి అందిస్తున్నట్లు ఓ ఫొటోను అమూల్‌ తయారు చేసింది. ప్రజ్ఞానంద విజయంలో ఆమె పాత్ర చాలా కీలకమైనదిగా చూపిస్తోంది ఆ చిత్రం. అమూల్ ఐకానిక్‌ స్టైల్లో వేయించిన ఆ  చిత్రాన్ని కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంది. దీంతో ఆ పోస్టుపై అభిప్రాయాలను నెటిజన్లు కామెంట్ల రూపంలో పంచుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని