Virat-Anushka: మరోసారి తల్లిదండ్రులైన విరాట్‌- అనుష్క

విరాట్‌ కోహ్లీ- అనుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు విరాట్‌ ప్రకటించారు.

Updated : 20 Feb 2024 21:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli), ప్రముఖ నటి అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు విరాట్‌ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. తమ బాబుకు ‘అకాయ్‌’ (Akaay)గా నామకరణం చేసినట్లు తెలిపారు. ‘‘మేం ఫిబ్రవరి 15న మా కుమారుడు అకాయ్‌ (వామిక తమ్ముడు)ను ఈ లోకంలోకి స్వాగతించాం. మా జీవితంలోని ఈ మధురమైన క్షణాల్లో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాం. మా గోప్యతను గౌరవించండి’’ అని విరాట్‌ పేర్కొన్నాడు.

వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ మొత్తానికి కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘకాలం పాటు ఆట నుంచి విరామం తీసుకోవడంతో.. అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని ప్రచారం జరిగింది. ఈ జంటకు ఇప్పటికే ఓ పాప (వామిక) ఉన్న విషయం తెలిసిందే. తమ అభిమాన స్టార్‌ క్రికెటర్‌కు బాబు పుట్టడంతో విరాట్-అనుష్క జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని