Rahul Dravid: సీనియర్‌గా మారినా ఎప్పటికీ ఆయన స్టూడెంట్‌నే.. ధ్రువ్‌ ఎమోషనల్‌ పోస్టు

ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను ఉద్దేశిస్తూ భారత జట్టు వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జరెల్‌ సోషల్‌ మీడియాలో భావోద్వేగమైన పోస్టు పెట్టాడు.

Published : 29 Feb 2024 14:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ ఇండియా వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ (Dhruv Jurel) ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ (Rahul Dravid) గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్‌ పోస్టు పెట్టాడు. అతడు ఎంతో గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించాడు.

‘‘రాహుల్‌ ద్రవిడ్‌ ఎంతో గొప్ప వ్యక్తి. జూనియర్‌ నుంచి సీనియర్‌గా మారినా నేను ఎప్పుడూ ఆయనకు నిత్య విద్యార్థినే’’ అని ధ్రువ్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. ఆయనతో తాను గతంలో దిగిన ఫొటోలను షేర్‌ చేసుకున్నాడు. 2020లో అండర్‌-19 ప్రపంచకప్‌లో ద్రవిడ్‌ కోచ్‌గా ఉన్నప్పుడే ధ్రువ్‌ జట్టులోకి వచ్చాడు. వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇప్పుడు సీనియర్‌ జట్టులోకి ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలోనే ధ్రువ్‌ అరంగేట్రం చేయడం విశేషం. ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో వెటరన్ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ చేతుల మీదుగా ధ్రువ్ టెస్టు క్యాప్‌ను అందుకొన్నాడు.

బీసీసీఐ నిర్ణయం వల్లే.. దేశవాళీ క్రికెట్‌ ఇంకా బతికి ఉంది: ఉన్ముక్త్‌ చంద్

ఇటీవల భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో అదరగొట్టాడు. టీమ్‌ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌ను ఓడించి భారత జట్టు సిరీస్‌ను సొంతం చేసుకొంది. ధర్మశాల వేదికగా ఐదో టెస్ట్‌ మార్చి 7న ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని