IND vs SA : మూడో టెస్టుకి కోహ్లీ అందుబాటులోకి వస్తాడు: రాహుల్ ద్రవిడ్‌

టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో ప్రారంభం కానున్న మూడో టెస్టు మ్యాచ్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని హెడ్ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ తెలిపాడు...

Published : 07 Jan 2022 18:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో ప్రారంభం కానున్న మూడో టెస్టు మ్యాచ్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని హెడ్ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ తెలిపాడు. ‘మూడో టెస్టు ప్రారంభం కావడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ఆలోపు కోహ్లీ పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నాను. నెట్ సెషన్స్‌లో ఇబ్బంది పడకుండా రాణించగలిగితే.. కచ్చితంగా మూడో టెస్టుకి అతడు అందుబాటులోకి వస్తాడు’ అని రాహుల్ ద్రవిడ్‌ పేర్కొన్నాడు. వెన్నునొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు విరాట్‌ దూరమైన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా, జొహన్నెస్ బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ తీరుపై కూడా ద్రవిడ్‌ స్పందించాడు. ‘పిచ్‌ నుంచి ఇరు జట్ల బ్యాటర్లకు సవాల్ ఎదురైంది. అయినా, రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు గొప్పగా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. మేం ఇంకో 50-60 పరుగులు చేసుంటే.. ఫలితం మరోలా ఉండేదేమో.! హనుమ విహారి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మెరుగ్గా రాణించాడు. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ (123) శతకంతో రాణించడంతో మా జట్టు విజయం సాధించింది. అలాగే, రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ (96) కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో.. సఫారీలు గెలుపొందారు’ అని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. 

రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో టీమ్‌ఇండియాపై గెలుపొందిన దక్షిణాఫ్రికా.. 1-1 తేడాతో సిరీస్‌ను సమం చేసింది. సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టు కేప్ టౌన్‌ వేదికగా జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని