Team India: అతడు టీమ్‌ఇండియా భవిష్యత్‌ కెప్టెన్‌.. యువ ఆటగాడిపై ప్రశంసలు కురిపించిన భారత మాజీ సెలక్టర్‌

భారత యువ బ్యాటర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad)కు భవిష్యత్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ అయ్యే సత్తా ఉందని మాజీ వికెట్ కీపర్‌, సెలక్టర్ కిరణ్ మోరె (Kiran More) అభిప్రాయపడ్డాడు.

Updated : 20 Aug 2023 18:26 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా యువ బ్యాటర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad)పై భారత మాజీ వికెట్ కీపర్‌, సెలక్టర్ కిరణ్ మోరె (Kiran More) ప్రశంసలు కురిపించాడు. అతడు ఎంతో నాణ్యమైన ఆటగాడని, భవిష్యత్తులో భారత జట్టును నడిపించే సత్తా గైక్వాడ్‌కు ఉందని మోరె అభిప్రాయపడ్డాడు. 26 ఏళ్ల రుతురాజ్‌ ఐపీఎల్‌లో ధోనీ (MS Dhoni) సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గైక్వాడ్ ధోనీ కెప్టెన్సీలో ఆడి జట్టును ముందుకు నడిపించడం, పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాలను నేర్చుకున్నాడని భారత మాజీ సెలక్టర్‌ చెప్పాడు. రుతురాజ్‌ గైక్వాడ్ 2020లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి నిలకడగా ఆడుతూ సీఎస్కేకు కీలక ఆటగాడిగా మారాడు. అనంతరం టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్నాడు.

పసికూనలు కాదు.. కసికూనలు.. షాక్‌లు మీద షాకులిస్తున్నాయిగా!

‘‘రుతురాజ్‌ గైక్వాడ్ టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించొచ్చు. అతడు ఐపీఎల్‌లో ధోనీ సారథ్యంలో ఆడి జట్టును నిర్వహించడం, పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాలను నేర్చుకున్నాడు. రుతురాజ్‌ నాణ్యమైన ఆటగాడు. అన్ని ఫార్మాట్లలో ఆడే సత్తా అతడికుంది. గైక్వాడ్ టెస్టు అరంగేట్రం కోసం నేను ఎంతో ఆసక్తిగా  ఎదురుచూస్తున్నా. మరో యువ కెరటం యశస్వి జైస్వాల్ కూడా అత్యుత్తమ ఆటగాడే’’ అని కిరణ్‌ మోరె పేర్కొన్నాడు. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు చైనాలోని హాంగ్జౌలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ టోర్నీలో రుతురాజ్‌ గైక్వాడ్‌ టీమ్‌ఇండియాను ముందుండి నడిపించనున్నాడు. 

ఆసియా క్రీడలకు భారత జట్టు:

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్‌). 

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని