కివీస్‌ స్కోరు 401.. వర్షంతో ఆగిన మ్యాచ్‌.. DLS ప్రకారం పాక్‌కే విజయావకాశాలు!

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ (NZ vs PAK) మధ్య  రసవత్తరంగా సాగుతోన్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగిస్తున్నాడు.

Updated : 04 Nov 2023 17:30 IST

బెంగళూరు: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ (NZ vs PAK) మధ్య రసవత్తరంగా సాగుతోన్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగిస్తున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో పాకిస్థాన్ దీటుగా ప్రతిఘటిస్తోంది. వర్షం వల్ల ఆట నిలిచిపోయేసరికి 21.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్ ఫకార్ జమాన్‌ (106*; 69 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) దూకుడగా ఆడుతూ శతకం పూర్తి చేసుకున్నాడు. బాబర్ అజామ్ (47*; 51 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకానికి చేరువలో ఉన్నాడు. డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం.. పాక్‌ విజయానికి 21.3 ఓవర్లలో 150 పరుగులు అవసరం. ఇప్పటికే పాకిస్థాన్‌ 160/1 స్కోరు కొనసాగుతోంది. దీంతో 10 పరుగుల ముందంజలోనే ఉండటం గమనార్హం. పాక్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. ఇందులో విజయం సాధిస్తేనే ఆ జట్టు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని