అదే మా విజయ రహస్యం

కీలక సమయాల్లో రాణించడమే మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయ రహస్యమని ఆ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పింది.

Published : 28 Mar 2023 03:08 IST

ముంబయి: కీలక సమయాల్లో రాణించడమే మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయ రహస్యమని ఆ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పింది. ‘‘టోర్నీ ఆరంభం నుంచి కీలక సమయాల్లో ఎలా రాణించాలనే విషయంపైనే దృష్టి పెట్టాం. కప్‌ కోసం కాదు.. ముఖ్యమైన పరిస్థితులను ఎలా సొమ్ము చేసుకోవాలో ఆలోచించాం. అప్పుడు ట్రోఫీ దానంతట అదే వస్తుందనేది మా నమ్మకం’’ అని హర్మన్‌ప్రీత్‌ చెప్పింది. కెప్టెన్‌గా ఒక పెద్ద టోర్నీలో కప్‌ గెలవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లు ఆమె పేర్కొంది. ‘‘భారత్‌ కెప్టెన్‌గా కొన్నిసార్లు జట్టును ఫైనల్‌ చేర్చగలిగా. కానీ కప్‌ మాత్రం సాధించలేకపోయా. అయితే డబ్ల్యూపీఎల్‌ భిన్న టోర్నీ. జట్లు కూడా భిన్నమైనవే. అన్ని జట్లూ సమతూకంగా ఉన్నాయి. పోటీ ఉన్న ఇలాంటి లీగ్‌లో విజేతగా నిలవడం సంతోషంగా అనిపిస్తోంది. దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఫైనల్లో రాధ యాదవ్‌, శిఖా పాండే గొప్పగా ఆడారు. మెరుపు షాట్లతో జట్టుకు మంచి స్కోరు సాధించిపెట్టారు. భారత్‌ తరఫున కూడా వాళ్లిద్దరూ ఇదే స్ఫూర్తితో రాణించాలని కోరుకుంటున్నా’’ అని హర్మన్‌ చెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని