Ravi Shastri: ఆ రికార్డునూ కోహ్లి బద్దలు కొట్టగలడు

దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ పేరిట ఉన్న 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి బద్దలు కొట్టగలడని భారత మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు.

Updated : 17 Nov 2023 05:28 IST

ముంబయి: దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ పేరిట ఉన్న 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి బద్దలు కొట్టగలడని భారత మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 శతకాలతో సచిన్‌ మొత్తం 100 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 29, వన్డేల్లో 50, టీ20ల్లో ఒక సెంచరీ రాబట్టిన కోహ్లి ఖాతాలో 80 అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి. ‘‘సచిన్‌ తెందుల్కర్‌ 100 సెంచరీలు సాధించినప్పుడు అతని దరిదాపుల్లోకి ఎవరైనా వస్తారని ఊహించారా? కానీ కోహ్లి 80 శతకాలు సాధించాడు. వన్డేల్లోనే 50 సెంచరీలు. ఈ ఫార్మాట్లో అత్యధిక శతకాల రికార్డు సృష్టించాడు. ఏదీ అసాధ్యం కాదు. కోహ్లి లాంటి ఆటగాళ్లు సెంచరీలు కొట్టడం మొదలుపెడితే వేగంగా శతకాలు రాబడతారు. కోహ్లి మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. కనీసం మూడు, నాలుగేళ్లు బరిలో ఉంటాడు’’ అని రవిశాస్త్రి తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని