India vs Australia: అమితాబ్‌.. దయచేసి ఫైనల్‌ చూడొద్దు!

ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు. దేశంలోని ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆదివారం తుదిపోరు కోసం ఎదురు చూస్తున్నారు.

Updated : 18 Nov 2023 06:55 IST

దిల్లీ: ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌(India vs Australia) తలపడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు. దేశంలోని ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆదివారం తుదిపోరు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఫైనల్‌ను చూడొద్దంటూ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను అభిమానులు కోరుతున్నారు. ఆయన వీక్షిస్తే భారత్‌ ఓడిపోయే ప్రమాదం ఉంటుందన్నది వారి నమ్మకం. సెమీస్‌లో కివీస్‌పై టీమ్‌ఇండియా విజయం తర్వాత.. ‘‘నేను చూడనప్పుడే మనం గెలుస్తాం’’ అని అమితాబ్‌(Amitabh Bachchan) ట్వీట్‌ చేశారు. ఇది ఇప్పుడు విస్తృతమైంది. దీంతో దయచేసి ఫైనల్‌ చూడొద్దంటూ ఆయన్ని అభిమానులు కోరుతున్నారు. జట్టు కోసం మరో త్యాగం చేయాలని చెబుతున్నారు.  ఈ కామెంట్లపై స్పందించిన అమితాబ్‌.. ‘‘ఆ మ్యాచ్‌కు వెళ్లాలా? వద్దా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా’’ అని మరోసారి ఎక్స్‌లో పోస్టు చేశారు. టీమ్‌ఇండియా ఆడేటప్పుడు ఇలాంటి నమ్మకాలను అమితాబ్‌ పాటిస్తారని 2011లో ఆయన తనయుడు అభిషేక్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని