Harman preet kaur: మహిళా క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎంపిక

భారత మహిళల క్రికెట్‌ జట్టు కొత్త కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎంపికైంది. అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలీరాజ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజే సెలక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Updated : 08 Jun 2022 19:36 IST

దిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు కొత్త కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎంపికైంది. అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలీరాజ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. శ్రీలంక పర్యటనకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో వన్డే, టీ20 జట్టులను ప్రకటించింది. జూన్‌ 23 నుంచి దంబుల్లాలో శ్రీలంకతో టీమిండియా మూడు టీ 20 మ్యాచ్‌లు (జూన్ 23, 25, 27) ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి క్యాండీలో మూడు వన్డేలు (జులై 1, 4, 7, తేదీల్లో) జరుగుతాయి. 

భారత మహిళల టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్‌ కీపర్‌), మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్‌, సిమ్రాన్, రిచా ఘోష్, పూజ వస్త్రాకర్, రేణుకా సింగ్, రోడ్రిగ్స్, రాధా యాదవ్.

భారత మహిళల వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్‌), మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్‌, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్ (కీపర్‌), పూజ వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా, హర్లీన్ డియోల్.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని