Team India : వన్డే సిరీస్‌ కోసం.. అహ్మదాబాద్‌ చేరుకున్న టీమ్‌ఇండియా

వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టు అహ్మదాబాద్‌కి చేరుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లు బయోబబుల్లోకి ప్రవేశించారు. ఆటగాళ్లంతా...

Published : 31 Jan 2022 22:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టు అహ్మదాబాద్‌కి చేరుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లు బయోబబుల్లోకి ప్రవేశించారు. ఆటగాళ్లంతా మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఫిబ్రవరి 6 నుంచి భారత వెస్టిండీస్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌కి అందుబాటులోకి రానున్నాడు. పూర్తిస్థాయి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక రోహిత్‌ ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం.

అహ్మదాబాద్‌కు బయలుదేరే సమయంలో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో కలిసి దిగిన ఫొటోను లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి పునరాగమనం చేయగా.. యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ భారత జట్టులోకి అరంగేట్రం చేయనున్నాడు. ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్‌ వేదికగా మూడు వన్డే మ్యాచులు.. ఫిబ్రవరి 16, 18 తేదీల్లో కోల్‌కతా వేదికగా రెండు టీ20 మ్యాచులు జరుగనున్నాయి. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో సొంతం చేసుకున్న వెస్టిండీస్‌ జట్టు.. త్వరలో అహ్మదాబాద్‌కి రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని