FIFA: మానసిక క్షోభను జయించి.. ప్రపంచకప్ విన్నింగ్ గోల్ కొట్టి..!
ఆండ్రెస్ ఇనెయెస్టా ఒంటిచేత్తో స్పెయిన్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించాడు. ఈ టోర్నీకి ముందు వరకు అతడు మానసిక కుంగుబాటుతో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కానీ, ఈ టోర్నీలో అద్బుతంగా రాణించాడు.
(ఫొటో: ఫిఫా టీవీ)
ఇంటర్నెట్‌డెస్క్: 2010 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్పెయిన్ ఆటగాడు ఆండ్రెస్ ఇనెయెస్టా ఓ పెను సంచలనం. ఈ టోర్నీకి దాదాపు ఏడాది ముందు తన సన్నిహిత మిత్రుడు, జట్టులో సెంట్రల్ డిఫెండర్ డేనియల్ జార్క్ గుండెపోటుతో మరణించాడు. నాటి నుంచి ఇనెయెస్టా మానసికంగా కుంగిపోయాడు. టోర్నీకి ముందు చాలా సార్లు మానసిక చికిత్స పొందాడు. ట్రైనింగ్ సెషన్లను అర్ధాంతరంగా ముగించేవాడు. ఆ పరిస్థితుల్లోనే స్పెయిన్ తరఫున బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో స్పెయిన్, నెదర్లాండ్స్ ఫైనల్స్‌కు చేరుకొన్నాయి.
డేవిడ్ విల్లా, ఇకర్ కాసిల్లస్ వంటి స్టార్లతో స్పెయిన్ జట్టు బలంగా ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో అది ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఈ విషయం గ్రహించిన నెదర్లాండ్స్ అటాకింగ్ గేమ్ కంటే.. రక్షణాత్మకంగా ఆడటానికి ప్రాధాన్యం ఇచ్చింది. గోల్ పోస్టును దుర్బేధ్యంగా మార్చేసింది. దీంతో మ్యాచ్ టైమ్ (90 నిమిషాలు)లో గోల్ చేయడం స్పెయిన్ ఆటగాళ్ల వల్ల కాలేదు. ఇరు జట్లు 0-0 స్కోర్‌తో ఉన్నాయి. దీంతో అదనపు సమయం కేటాయించారు. కాలం కరుగుతున్నా.. ఇరుపక్షాలకు గోల్ దక్కలేదు. మరో 4 నిమిషాల్లో సమయం ముగుస్తుందనగా.. ఆండ్రెస్ ఇనెయెస్టా ఓ వాలీడ్ షాట్‌తో అద్భుతమైన గోల్ చేసి స్పెయిన్‌కు ఆధిక్యం అందించాడు. ఈ సమయంలో సంబరాలు చేసుకొంటూ చొక్కావిప్పాడు. అతడి బనియన్‌పై ‘డేని జార్క్.. ఎప్పుడూ మాతోనే ఉన్నావు’ అని రాసి ఉంది. అతడు షర్ట్ విప్పినందుకు ఎల్లోకార్డుకు గురయ్యాడు. ఈ మ్యాచ్‌ను స్పెయిన్ గెలిచింది. దీంతో తొలిసారి ప్రపంచకప్ ఆ దేశానికి సొంతమైంది.
ఈ మ్యాచ్‌లో రెఫరీలు 14 సార్లు ఎల్లోకార్డులు చూపించారు. ఇదొక రికార్డు. 1986 అర్జెంటీనా-వెస్ట్ జర్మనీ మ్యాచ్‌లో ఆరు ఎల్లో కార్డులే రికార్డుగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్‌కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
హైదరాబాద్‌కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
చెపాక్‌లో చూసుకుందాం.. లఖ్‌నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్‌కు వచ్చేసింది. లఖ్‌నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్‌నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్‌లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్‌లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్‌గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్‌రైజర్స్‌కు దొరికిన మరో వార్నర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్‌లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్‌లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్‌ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్‌కు మరో పేస్ ఆల్‌రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్‌తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్‌లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్‌గా అదరగొట్టి!
లఖ్‌నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్‌తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు. -
వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్‌తో గుజరాత్‌పై పంజాబ్‌కు విజయం అందించిన శశాంక్ సింగ్‌పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్‌కతా ఆటగాడు మళ్లీ బ్యాట్‌తో అదరగొట్టేస్తున్నాడు. -
వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్‌కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. -
పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్‌ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు. -
రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. -
కొత్త పేస్ స్టార్.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్ యాదవ్
ఐపీఎల్ ప్లాట్‌ఫామ్ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్ పేసర్‌పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు..
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం