IPL 2022: గుజరాత్ టైటాన్స్‌ జట్టులోకి అఫ్గాన్‌ ఓపెనర్‌.!

త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్)-2022 సీజన్‌లో కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్‌ జట్టులోకి అఫ్గానిస్థాన్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ని తీసుకునే అవకాశమున్నట్లు..

Published : 09 Mar 2022 01:14 IST

(Photo : Rahmanullah Gurbaz Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) - 2022 సీజన్‌లో కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్‌ జట్టులోకి అఫ్గానిస్థాన్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ని తీసుకునే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాల రీత్యా ఐపీఎల్ ప్రారంభం కాక ముందే ఇంగ్లాండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ గుజరాత్ జట్టు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడి స్థానంలో రహ్మనుల్లాను తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రహ్మానుల్లాను జట్టులోకి తీసుకుంటే వికెట్ కీపింగ్‌ విషయంలో కూడా గుజరాత్‌కి కలిసొస్తుంది. ప్రస్తుతం మాథ్యూ వేడ్‌, వృద్ధిమాన్‌ సాహా వంటి వికెట్ కీపర్లు అందుబాటులో ఉన్నారు. అయితే, పాకిస్థాన్‌ పర్యటనకు ఎంపికైన మాథ్యూ వేడ్‌.. ఐపీఎల్‌ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నాడు. మరోవైపు, సాహాకు వికెట్‌ కీపర్‌గా ఐపీఎల్‌లో మెరుగైన రికార్డేమీ లేదు. ఈ నేపథ్యంలో రహ్మనుల్లాను జట్టులోకి తీసుకోవడం లాంఛనమే కావచ్చు! 

అంతర్జాతీయ క్రికెట్లో 20 టీ20 మ్యాచులు ఆడిన రహ్మానుల్లా 137.63 సగటుతో 534 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే, 9 వన్డేల్లో 91.85 స్ట్రైక్‌ రేట్‌తో మూడు శతకాలు సహా 428 పరుగులు చేశాడు. గుజరాత్‌ జట్టుకు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా, ఆశిష్‌ నెహ్రా హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. మార్చి 26 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని