Google: గూగుల్ సెర్చ్.. టాప్‌-10లో ముగ్గురు టీమ్‌ఇండియా క్రికెటర్లు

భారతదేశంలో ఈ ఏడాది (2023) అత్యధికంగా గూగుల్ చేసిన వ్యక్తుల వివరాలను గూగుల్ సోమవారం వెల్లడించింది. ఈ జాబితాలో టాప్‌-10లో ఆరుగురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. 

Published : 12 Dec 2023 02:26 IST

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో ఈ ఏడాది (2023) గూగుల్‌లో అత్యధికమంది శోధించిన వ్యక్తుల జాబితాను గూగుల్ (Google) సోమవారం వెల్లడించింది. ఈ జాబితాలో టాప్‌-10లో ఆరుగురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. ఇందులో ముగ్గురు టీమ్‌ఇండియా ఆటగాళ్లున్నారు. బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ అగ్రస్థానంలో నిలవగా.. ఆమె భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఆరో స్థానం దక్కించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది శోధించిన నటుల జాబితాలో కియారా అడ్వాణీ తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఇక, భారత్‌లో అత్యధిక మంది శోధించిన వ్యక్తుల్లో టీమ్ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌, కివీస్‌ ప్లేయర్ రచిన్ రవీంద్ర, భారత పేసర్ మహ్మద్‌ షమి వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ప్రముఖ యూట్యూబర్‌ ఎల్విష్‌ యాదవ్‌ ఐదు, ఆసీస్‌ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఏడు, ఇంగ్లాండ్ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హమ్‌ ఎనిమిది స్థానాల్లో నిలిచారు. టీమ్‌ఇండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ తొమ్మిది, ఆసీస్‌ క్రికెటర్ ట్రావిస్ హెడ్ పదో స్థానాన్ని దక్కించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని